Anantapur: అనంతపురంలో సాయంత్రం భర్త హత్య.. తెల్లారి భార్య మృతి.!

|

Mar 13, 2024 | 6:57 PM

అనంతపురంలోని జెఎన్‎టీయు సమీపంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్‎గా పని చేసిన మూర్తిరావు హత్యకు గురయ్యారు. మార్చి 10న ఇంట్లోనే ఉన్న మూర్తిరావును మేనల్లుడు ఆదిత్య గొంతు కోసి హత్య చేశాడు. మేనల్లుడు ఆదిత్యకు ఉద్యోగం ఇప్పిస్తానని మూర్తిరావు డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో మేనల్లుడు ఆదిత్య కత్తితో మూర్తిరావు గొంతు కోసి హత్య చేశాడు.

అనంతపురంలోని జెఎన్‎టీయు సమీపంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్‎గా పని చేసిన మూర్తిరావు హత్యకు గురయ్యారు. మార్చి 10న ఇంట్లోనే ఉన్న మూర్తిరావును మేనల్లుడు ఆదిత్య గొంతు కోసి హత్య చేశాడు. మేనల్లుడు ఆదిత్యకు ఉద్యోగం ఇప్పిస్తానని మూర్తిరావు డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో మేనల్లుడు ఆదిత్య కత్తితో మూర్తిరావు గొంతు కోసి హత్య చేశాడు. సొంత కుటుంబ సభ్యుడి చేతిలోనే మూర్తిరావు హత్యకు గురవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. మూర్తిరావు హత్య జరిగి 24 గంటలు గడవక ముందే తెల్లారి భార్య శోభ కూడా మృతి చెందారు. మూర్తిరావు భార్య శోభ గుండెపోటుతో తెల్లవారుజామున మరణించారు. కళ్ళ ముందే భర్త హత్య చూసిన భార్య శోభ అది తట్టుకోలేక తెల్లారి కల్లా గుండె పోటుతో మరణించారు. భర్త హత్యకు గురైన 24 గంటల్లోనే.. భార్య గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించలేదన్న కక్షతో ఆదిత్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం మూర్తిరావు మేనల్లుడు ఆదిత్యను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on