Starbucks: ఉద్యగోం తీసేసారని.. ప్రతీకారంగా ఆ సంస్థకే ఎసరు పెట్టాడుగా..! సీక్రెట్స్ ఇలా..

|

Oct 18, 2023 | 7:50 PM

తనను ఉద్యోగంనుంచి తీసేసారని కక్షగట్టిన ఓ వ్యక్తి ఏకంగా సంస్థకే ఎసరు పెట్టాడు. ఉద్యోగం పోగొట్టుకుని బయటకు రాగానే ఆ సంస్థకు సంబంధించిన సీక్రెట్స్‌ నెట్టింట షేర్‌ చేశాడు. అది చూసిన నెటిజన్లు ఇది సరికాదని, ఈ ఘటన మిగతా ఉద్యోగులకే కాకుండా కొత్తగా చేరేవారిని ఇబ్బందులకు గురిచేస్తుందని హెచ్చరించారు. ఆ ఉద్యోగి తీరుపై పలువురు మండిపడ్డారు. ఈ ఘటన స్టార్‌బక్స్ సంస్థలో జరిగింది.

తనను ఉద్యోగంనుంచి తీసేసారని కక్షగట్టిన ఓ వ్యక్తి ఏకంగా సంస్థకే ఎసరు పెట్టాడు. ఉద్యోగం పోగొట్టుకుని బయటకు రాగానే ఆ సంస్థకు సంబంధించిన సీక్రెట్స్‌ నెట్టింట షేర్‌ చేశాడు. అది చూసిన నెటిజన్లు ఇది సరికాదని, ఈ ఘటన మిగతా ఉద్యోగులకే కాకుండా కొత్తగా చేరేవారిని ఇబ్బందులకు గురిచేస్తుందని హెచ్చరించారు. ఆ ఉద్యోగి తీరుపై పలువురు మండిపడ్డారు. ఈ ఘటన స్టార్‌బక్స్ సంస్థలో జరిగింది. స్టార్‌బక్స్ బ్రాండ్ గురించి తెలియని వారు ఉండరు. కాఫీలు, ఇతర పానీయాలకు ఈ కేఫ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్. అక్కడి రుచి మరే చోటా లభించదని కాఫీ ప్రియులు చెబుతారు. ఇక స్టార్‌బక్స్‌ తన పానీయాల రెసిపీ సీక్రెట్స్ ను జాగ్రత్తగా ఉంచుతుంది. వీటిని బయట పెట్టకూడదంటూ ఉద్యోగులపై కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. కానీ, తనను ఉద్యోగం నుంచి తీసేసినందుకు స్టార్‌‌బక్స్‌పై ఓ వ్యక్తి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఏ పానీయాన్ని ఎలా తయారు చేయాలో చెప్పే రకరకాల రెసిపీలను మొత్తం నెట్టింట షేర్ చేశాడు. ఇది చూసి నెటిజన్లు పండగ చేసుకున్నారు. ఈ లీకైన రెసిపీల ఆధారంగా ఇంట్లోనే స్టార్‌బక్స్ స్థాయి కాఫీలు తయారు చేసుకోవచ్చని సంబరపడ్డారు. ఇంట్లో ఏం ఖర్మ… వ్యాపారం కూడా చేసేయొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ చర్య తరువాత స్టార్‌బక్స్‌లో నిబంధనలు మరింత కఠినతరం అవుతాయని, అది కొత్త ఉద్యోగులకు సవాలుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ రెసిపీల ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేయడం ఇబ్బందికరమే అని కొందరు హెచ్చరించారు. అయితే, గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని కొందరు చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..