Woman Viral: చనిపోయిందని డాక్టర్ల నిర్దారణ.. కొద్దిసేపటికే కళ్లు తెరిచిన మహిళ.! వీడియో..

|

Oct 28, 2023 | 8:53 PM

అమెరికాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. టీనాహైన్స్‌ అనే మహిళ అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు చికిత్సకోసం ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో ఓ అరగంటపాటు ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆమె శరీరం కూడా నీలంగా మారిపోయింది. టీనాను పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్టుగా నిర్ధారించారు. ఇక ఆస్పత్రినుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కుటుంబ సభ్యులు.

అమెరికాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. టీనాహైన్స్‌ అనే మహిళ అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు చికిత్సకోసం ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో ఓ అరగంటపాటు ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆమె శరీరం కూడా నీలంగా మారిపోయింది. టీనాను పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్టుగా నిర్ధారించారు. ఇక ఆస్పత్రినుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కుటుంబ సభ్యులు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుంది. లైఫ్‌ సపోర్ట్‌ వ్యవస్థపై ఉన్న టీనా కొంతసేపటి తర్వాత మేల్కొంది. ఇది చూసి అక్కడున్న వారు షాకయ్యారు. తన కుటుంబ సభ్యులతో పేపర్‌, పెన్ను కావాలని సైగలు చేసింది. వాటిని ఆమెకు ఇవ్వగా ఆ కాగితంపై ఏదో రాసింది. అయితే కాగితంపై రాసిన ఇంగ్లీష్‌ అక్షరాలు అస్పష్టంగా ఉన్నాయి. తాను రియల్‌ అన్న సందేశాన్ని కాగితంపై రాసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని నిమిషాలపాటు ఈ లోకంలో లేని ఆమె.. స్వర్గానికి చేరుకుని జీసస్‌ను చూసినట్లు తమకు చెప్పిందని స్థానిక మీడియాకు తెలిపారు. ఇది చాలా అద్భుతమని పేర్కొన్నారు. అనంతరం కొన్ని రోజులపాటు ఆసుపత్రితో చికిత్స పొందిన టీనా.. ఆ తర్వాత డిశ్చార్జ్‌ అయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..