Carrex syrup: అది ఇవ్వలేదని మెడికల్ షాపు వద్ద యువకుడి వీరంగం.! వైరల్ అవుతున్న వీడియో..
డ్రగ్స్ కు అలవాటుపడిన ప్రాణం.. మంచి చెడుల విచక్షణ మరచిపోతుందని వైద్యులు హెచ్చరించడమే కాదు.. అనేక సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి కూడా.. తాజాగా డ్రగ్స్ కు బానిసైన ఓ యువకుడు తాను అడిగిన సిరప్ ఇవ్వలేదంటూ..
డ్రగ్స్ కు అలవాటుపడిన ప్రాణం.. మంచి చెడుల విచక్షణ మరచిపోతుందని వైద్యులు హెచ్చరించడమే కాదు.. అనేక సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి కూడా.. తాజాగా డ్రగ్స్ కు బానిసైన ఓ యువకుడు తాను అడిగిన సిరప్ ఇవ్వలేదంటూ.. మెడికల్ షాప్ దగ్గర వీరంగం సృష్టించాడు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువకుడు డ్రగ్స్‌కు బానిసై ప్రతిరోజూ కారెక్స్ సిరప్ తాగుతుంటాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే పట్టణంలోని లోని UB సెంటర్ వద్ద ఉన్న ఓ మెడికల్ షాపు వద్దకు వెళ్లి కారెక్స్ సిరప్ అడిగాడు. అయితే ఆ మందుల షాపు యజమాని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడిగాడు. యువకుడు లేదని చెప్పడంతో అతను అడిగిన సిరప్ ఇవ్వడానికి నిరాకరించాడు షాపు యజమాని. దీంతో ఆ యువకుడు వేరే షాప్ వద్దకు వెళ్లి.. ఆ సిరప్ కొనుక్కుని తాగాడు. అనంతరం మత్తులో ఊగుతూ.. తనకు ముందుగా సిరప్ ఇవ్వనన్న మెడికల్ షాప్ వద్దకు వచ్చి.. ఆ షాప్ పై దాడికి దిగాడు. షాపుముందు గొడవ చేస్తూ రోడ్డు పై నానా వీరంగం సృష్టించాడు. దీంతో ఆ మెడికల్ షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..