బైక్‌పై జంట రొమాన్స్‌.. అందరూ చూస్తుండగానే..

Updated on: Jan 19, 2025 | 2:03 PM

కొంత మంది యువత బరితెగించి ప్రవర్తిస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, మెట్రోలో రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులుమీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టు ఎవరున్నా తమకేం అన్నవిధంగా ఉంటున్నారు. అదేదో ఫ్యాషన్‌ అన్నట్లు పబ్లిక్‌గానే రొమాన్స్‌ చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఫ్రీడమ్ పేరుతో.. నలుగురిలోనే గలీజ్ పనులన్ని చేస్తున్నారు. కొంత మంది ప్రేమ పేరుతో బైక్ ల మీద, కార్లలో రొమాన్స్ చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. ఈ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూపీలో జరిగిందీ ఘటన.

కాన్పూర్‌ లో ఓ జంట బైక్‌పై రొమాన్స్‌ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. యువతి బైక్‌ ముందు భాగంలో ఉన్న పెట్రోల్‌ ట్యాంక్‌పై కూర్చోగా.. యువకుడు బైక్‌ నడుపుతూ కనిపించాడు. ఆ సమయంలో ఇద్దరూ మితిమీరిన రొమాన్స్‌ చేస్తూ కెమెరాకు చిక్కారు. రోడ్డు మీద ముద్దులు పెట్టుకుంటు హల్ చల్ చేశారు. రోడ్డుపైన ఎవరుంటే తమకేం అన్న విధంగా రెచ్చిపోయారు. ఆవాస్‌ వికాస్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల వాహానాలు వెళ్తున్నాయన్న ఏ మాత్రం..ధ్యాస కూడా లేకుండా రోమాన్స్ తో రెచ్చిపోయారు. కొంత మంద వీరి పైత్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కాన్పూర్‌ పోలీసులు స్పందించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.