Elephant: ఏనుగుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.! వైరల్ అవుతున్న ఏనుగు వీడియో.
అటవీ సంపద నానాటికీ క్షీణిస్తుండటంతో జంతువులు ఆహారం కోసం జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అలా ఆహారాన్ని వెదుక్కుంటూ వస్తున్న ఏనుగులు పొలాల్లో ప్రవేశించి దాడులు చేస్తున్నాయి. ఓ అడవి ఏనుగు పంట పొలాల్లోకి వచ్చింది. కొందరు పోకిరీ వ్యక్తులు చెప్పులతో దానిని తరిమేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా తనదారిన అది వెళ్తుంటే అడ్డగించి మరీ ఏనుగును రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
అటవీ సంపద నానాటికీ క్షీణిస్తుండటంతో జంతువులు ఆహారం కోసం జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అలా ఆహారాన్ని వెదుక్కుంటూ వస్తున్న ఏనుగులు పొలాల్లో ప్రవేశించి దాడులు చేస్తున్నాయి. ఓ అడవి ఏనుగు పంట పొలాల్లోకి వచ్చింది. కొందరు పోకిరీ వ్యక్తులు చెప్పులతో దానిని తరిమేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా తనదారిన అది వెళ్తుంటే అడ్డగించి మరీ ఏనుగును రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కోపంతో చిర్రెత్తుకొచ్చిన ఏనుగు ఒక్కసారిగా వారిపై దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ పెద్ద ఏనుగు గుట్టపై నిలబడి కొందరు వ్యక్తులపై దాడికి ప్రయత్నించింది. వారంతా తలోదిక్కు నుంచి చెప్పులు, రాళ్లతో ఏనుగును తరిమేందుకు ప్రయత్నించారు. వీరిలో ఒక వ్యక్తి చెప్పు చేతుల్లోకి తీసుకుని ఏనుగు వెంట పడ్డాడు. మిగతా అందరూ భయంతో గుట్ట కిందనే ఉండి తరమడానికి ప్రయత్నించారు. ఏనుగు తన మానాన తాను వెళ్లిపోతుంటే సదరు వ్యక్తి మాత్రం అత్యుత్సాహంతో గుట్టపైకి ఎక్కి మరీ ఏనుగును రెచ్చగొట్టాడు. దీంతో ఏనుగుకి మరింత కోపం వచ్చింది. అంతే వెంటనే గట్టిగా ఘీంకారం చేస్తూ వారిపైకి రావడంతో వారంతా మళ్లీ గుట్టకిందకు దిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ షేర్ చేశారు. ఇక్కడ అసలు జంతువు ఎవరు? అనే క్యాప్షన్‌తో ఆయన ఈ వీడియోను షేర్ చేశారు. యువత క్రేజ్ నిజంగానే చాలా ప్రమాదకర స్థాయికి వెళ్లిందని కొందరు, ఇలాంటి వారిని అరెస్టు చేయాలని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పంట పొలాలను కాపాడుకోవడానికి యువకులు చేసిన పనిలో తప్పేంటి అంటూ మరికొందరు ప్రశ్నస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.