Viral: కన్న తల్లిని బ్రతికుండగానే స్మశానంలో వదిలేసిన కసాయి కొడుకు.. వీడియో.

|

Nov 08, 2023 | 8:28 PM

రోజు రోజుకీ సమాజంలో మానవత్వం నశించిపోతోందా అంటే.. నిజమే అనిపిస్తోంది. ఎక్కడో అక్కడ అలాంటి సంఘటనలు బిడ్డలను కన్న తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి. వృద్దాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన బిడ్డలు వారిని భారంగా భావిస్తున్నారు. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తుంటే కొందరు ఆమాత్రం కనికరం కూడా చూపడంలేదు.

రోజు రోజుకీ సమాజంలో మానవత్వం నశించిపోతోందా అంటే.. నిజమే అనిపిస్తోంది. ఎక్కడో అక్కడ అలాంటి సంఘటనలు బిడ్డలను కన్న తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి. వృద్దాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన బిడ్డలు వారిని భారంగా భావిస్తున్నారు. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తుంటే కొందరు ఆమాత్రం కనికరం కూడా చూపడంలేదు. అనాధలుగా రోడ్లపైన వదిలేస్తున్నారు. తాజగా వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లిని స్మశానంలో వదిలేసాడు ఓ కసాయి కొడుకు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామానికి చెందిన ఏడుకొండలు, వెంకటరత్నమ్మ దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. ఉన్నంతలో పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు. వృద్దాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు వెంకటేష్ కు వారు భారమయ్యారు. ఆస్తి పంపకంలో తలెత్తిన వివాదం కారణంగా కొడుకు, కోడలు వెంకటరత్నంపై దాడి చేశారు. ఈ క్రమంలో ఆమె చెయ్యి విరిగిపోయింది. ఈ విషయం బయటికి తెలుస్తుందని భావించిన వెంకటేష్.. కన్నతల్లి అనే కనికరం లేకుండా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలంలోని ఓ తండాలో ఉన్న శ్మశానవాటికలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మొక్కలకు నీళ్ళు పెట్టే డ్యూటీలో భాగంగా గ్రామపంచాయతీ వర్కర్ శ్రీనివాస్ స్వర్గధామానికి వెళ్లాడు. అక్కడ కొనఊపిరితో ఉన్న వెంకటరత్నమ్మను చూసి గ్రామ సర్పంచ్ కు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తులు, సర్పంచ్ ఆమె వివరాలు సేకరించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి వెళితే తనను కొడుకు, కోడలు చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్పత్రికి తీసుకు వెళ్లమని వేడుకొని కన్నీటి పర్యంతమైంది. గాయాలతో ఉన్న వృద్ధురాలిని పోలీసులు చికిత్స కోసం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దాచేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.