Viral: బతకడం అంత ఈజీ కాదు..ఈ వీడియో చూస్తే మీరే అంటారు.. కంటతడి పెట్టిస్తోన్న వీడియో.
జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి కాలం అగ్నిపరీక్ష పెడితే.. మరికొందరికి పూలబాటలు వేస్తుంది. అయితే ఎవరికీ బతకడం అంత ఈజీ ఏం కాదు.. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ జీవితాన్ని కొనసాగించాలి. లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరకీ తెలియదు. ఏ మలుపులో ఏ ప్రమాదం పొంచి ఉంటుందో ఊహించడం కష్టం. అలాంటి ఓ బాధాకర దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి కాలం అగ్నిపరీక్ష పెడితే.. మరికొందరికి పూలబాటలు వేస్తుంది. అయితే ఎవరికీ బతకడం అంత ఈజీ ఏం కాదు.. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ జీవితాన్ని కొనసాగించాలి. లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరకీ తెలియదు. ఏ మలుపులో ఏ ప్రమాదం పొంచి ఉంటుందో ఊహించడం కష్టం. అలాంటి ఓ బాధాకర దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి రైలువెంట పరుగులు తీసిన దృశ్యం ప్రతిఒక్కరినీ కలచి వేస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి అదుపు తప్పి పడిపోయాడు. ఇతను రైల్లో నీళ్ల బాటిళ్లు అమ్ముకోవడానికి రాటుదేలిన గులక రాళ్లలో తల మీద బరువుతో పరుగులు పెడుతూ రైలు ఎక్కబోయాడు. అతని కంటే ముందుగా మరో వ్యక్తి ఆహారంతో ఉన్న బుట్టతో కదులుతున్న రైలు చాకచక్యంగా ఎక్కేసాడు. అతడిని చూసి నీళ్ళ బాటిళ్లు అమ్మే వ్యక్తి కూడా అలాగే రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ అతను బ్యాలెన్స్ చేయలేక రాళ్లలో అమాంతంగా పడిపోయాడు. అతను పట్టాలకు దూరంగా పడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోయేవాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు. లైక్స్, కామెంట్స్‌తో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కొందరు నెటిజన్లు లైఫ్ ఈజ్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రివన్ అంటూ ఎమోషన్ తో కూడిన కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..