Snake Video: అనకొండతో గేమ్స్‌.. జాగ్రత్త గురూ! అనకొండ తోకపట్టి ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తి.. వీడియో చుస్తే షాక్ అవుతారు..

|

Feb 14, 2022 | 9:09 AM

Snake Viral Video: పాములంటే చాలా మంది పుట్టేడు భయంతో వణికిపోతుంటారు..మరికొందరు పాములతో గేమ్స్‌ ఆడుకుంటుంటారు..అలాంటి వారి కోవకే వస్తారు ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి..ఇతను కూడా భారీ అనకొండతో డెత్‌ గేమ్స్ ఆడుతున్నారు.


Man playing with Big Snake video: పాములంటే చాలా మంది పుట్టేడు భయంతో వణికిపోతుంటారు..మరికొందరు పాములతో గేమ్స్‌ ఆడుకుంటుంటారు..అలాంటి వారి కోవకే వస్తారు ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి..ఇతను కూడా భారీ అనకొండతో డెత్‌ గేమ్స్ ఆడుతున్నారు. ఇక్కడ ఓ వ్యక్తి నదిలో పడవలో వెళుతుండగా నీటిలో ఓ పెద్ద అనకొండ కనిపించింది. దాని పొడవు దాదాపు 17 అడుగులు ఉంటుంది. అది తలుచుకుంటే మనిషిని అమాంతం మింగేయ గలదు. అలాంటి అనకొండ తన మానాన తను నీళ్లలో ఉంటే.. ఆ వ్యక్తి దాని తోక పట్టుకు లాగడం ప్రారంభించాడు.పాపం…ఆ అనకొండ అతని చేతిలోంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. చివరికి అతను తోకను విడిచిపెట్టడంతో.. బతుకు జీవుడా అని నీళ్లలో ఈదు కుంటూ దూరంగా వెళ్లిపోతుంది…ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వేలల్లో కామెంట్లు పెట్టేస్తున్నారు. అనకొండతో ఆటలాడటం ప్రమాదకరమని పిల్లలకు కూడా తెలుసు.. ఆ మాత్రం నీకు తెలియదా? గురూ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. నీకు భూమిపై నూకలింకా మిగిలే ఉన్నాయని ఇంకొందరు కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ:

Knowledge Video: దేశంలో ఎన్ని కోట్ల మొబైళ్లు తయారయ్యాయో తెలుసా..? షాకింగ్ విషయాలు వెల్లడి..

Success Story Video: ఒకప్పుడు బిచ్చగత్తె… ఇప్పుడు కేఫ్‌ మేనేజర్‌.. ఒక సక్సెస్ స్టోరీ కోసం ఈ వీడియో చూడండి..(వీడియో)

Viral Video: రైతా మజాకా..! అవమానం జరిగిన చోటే పొందిన గౌరవం.. రైతుకు క్షమాపణ మరియు డోర్ డెలివరీ..

 

Follow us on