ox on bike: నీ తెలివికి దండం రా బాబు.. బైక్ పై ఎద్దును ఎక్కించుకొని లాంగ్‌ డ్రైవ్‌.. వైరల్ వీడియో.

|

Sep 19, 2022 | 9:54 AM

ఇంటర్నెట్‌లో ఫన్నీ కంటెంట్‌కి కొదవే లేదు. నిత్యం ఎన్నో వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని చాలా పన్నీగా ఉన్నా కొన్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి.


ఇంటర్నెట్‌లో ఫన్నీ కంటెంట్‌కి కొదవే లేదు. నిత్యం ఎన్నో వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని చాలా పన్నీగా ఉన్నా కొన్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ఒక వ్యక్తి తన బైక్‌పై ఎద్దును ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. అది చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. ఓ వ్యక్తి బైక్‌ వెనుక సీటుపైన ఎద్దును తాళ్లతో కట్టి ఎక్కడికో తరలిస్తున్నాడు. ఆ ఎద్దును ఎక్కడికైనా తరలించాలంటే ఓ చిన్నపాటి వ్యానును ఉపయోగించవచ్చు. కానీ అతను బైక్‌పై ఎద్దును ఎక్కించుకొని ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. ఆ ఎద్దు కూడా బైక్‌పై చాలా హాయిగా కూర్చుని లాంగ్‌ డ్రైవ్‌ ఎంజాయ్‌ చేస్తున్నట్టు కనిపిస్తోంది. బైక్ డ్రైవర్ ఎంతో అద్భుతంగా బైకును బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ వింత దృశ్యాన్ని చూసిన కొందరు తమ మొబైల్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేసారు. ఈ వీడియోను చూసి రకరకాలుగా స్పందించారు. కొంతమంది వినియోగదారులు వినోదభరితంగా ఉందంటూ కామెంట్‌ చేస్తుండగా, కొందరు ”సూపర్ యానిమల్ టాక్సీ” గురూ అంటూ కామెంట్‌ చేసారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us on