Allu arjun Sri valli Song: చిన్నారి టాలెంట్‌ అదిరిందిగా.. శ్రీవల్లి సాంగ్ ఛాలెంజ్ లో చిన్నారి..  నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

Allu arjun Sri valli Song: చిన్నారి టాలెంట్‌ అదిరిందిగా.. శ్రీవల్లి సాంగ్ ఛాలెంజ్ లో చిన్నారి.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Feb 16, 2022 | 6:27 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప.. ది రైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ సామాన్యుల నుంచి సెలబ్రేటి సహా అందరినీ ఆకట్టుకున్నాయి. తెలుగు వారు మాత్రమే కాదు.. దేశవిదేశాల్లోని యూత్ సాంగ్స్ ను అనుకరిస్తూ…


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప.. ది రైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ సామాన్యుల నుంచి సెలబ్రేటి సహా అందరినీ ఆకట్టుకున్నాయి. తెలుగు వారు మాత్రమే కాదు.. దేశవిదేశాల్లోని యూత్ సాంగ్స్ ను అనుకరిస్తూ… వీడియోలు షేర్ చేస్తున్నారు. చిన్న పెద్ద, ఆడ, మగ, అనే తేడా లేకుండా ఈ సినిమాలోని సన్నివేశాలను ఇమిటేట్ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీవల్లి ఛాలెంజ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఛాలెంజ్ లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొంటున్నారు. ఇప్పుడు శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ స్టెప్పులను అనుకరిస్తున్న ఓ చిన్నారి వీడియో వైరల్‌గా మారింది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ చిన్నారి అల్లు అర్జున్ హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేస్తోంది. ఆ చిన్నారి అల్లు అర్జున్ లా సేమ్ గీతల షర్ట్, అదే రంగు ఫ్యాంటును ధరించి. LCD టెలివిజన్‌లో ప్లే అవుతున్న శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ ను అనుకరిస్తూ.. డ్యాన్స్ చేసింది. ఆ చిన్నారి డ్యాన్స్ .. ఫీలింగ్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది . ప్రజలు తానియా డ్యాన్స్ ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. చాలా మంది లవ్ ఎమోజీలతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ వీడియోలోని చిన్నారి తానియా ,ఆమె తల్లి సోనీ ఇద్దరూ తరచుగా తమ డ్యాన్స్ వీడియోలను తమ ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేస్తుంటారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Published on: Feb 16, 2022 06:25 PM