wife-husband: ప్రియుడితో భార్య షికారు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త..! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
ఈ మధ్యకాలంలో వివాహ బంధాలు విచ్చిన్నం అవుతున్నాయంటే.. వివాహేతర సంబంధమే దానికి ప్రధాన కారణం. పరాయి వ్యక్తి మోజులో పడి కొందరు భార్య భర్తలు పిల్లలను వదిలేసి వెళ్లిపోతే..
ఈ మధ్యకాలంలో వివాహ బంధాలు విచ్చిన్నం అవుతున్నాయంటే.. వివాహేతర సంబంధమే దానికి ప్రధాన కారణం. పరాయి వ్యక్తి మోజులో పడి కొందరు భార్య భర్తలు పిల్లలను వదిలేసి వెళ్లిపోతే.. మరికొందరు ఆ బంధానికి అడ్డుపడ్డ వారిని హతమారుస్తుండటం జరుగుతోంది. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లయి ఓ కూతురు ఉన్న మహిళ.. పరాయి వ్యక్తి మోజులో పడింది. కట్టుకున్న వాడికి తెలియకుండా ప్రియుడితో జాలీగా షికార్లు చేస్తోంది. అయితే భర్తకు తన భార్యపై అనుమానమొచ్చి.. ఫాలో అవ్వడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 11న భర్తతో గొడవపడిన సదరు మహిళ ఇల్లు వదిలి వెళ్లిపోయింది.ఆమెపై అనుమానంతో తన కూతురుతో సహా బయటికి వచ్చి.. భార్య కోసం వెతకడం మొదలుపెట్టాడు భర్త. అనుకున్నట్లుగానే ప్రియుడితో స్కూటీపై వెళ్తూ కనిపించింది భార్య. అతడ్ని చూసిన వెంటనే తప్పించుకునేందుకు భార్య, ఆమె ప్రియుడు ప్రయత్నించారు. అయితే భర్త తన బైక్ వేగంగా డ్రైవ్ చేసి వారిని పట్టుకున్నాడు. రోడ్డుపైనే భార్య, ప్రియుడిని చెప్పుతో చితకబాదాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. కాగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..