Buffello-Youngman: ఇదేం సరదారా బాబు.. గేదెకు ప్రపోజ్ చేసిన యువకుడు.. అది ఇచ్చిన రిప్లైతో షాక్..
సరదా కోసం ఎన్నో చిలిపి పనులు చేస్తూ ఉంటాం. కాని ఆ సరదా శృతి మించకూడదు. ఒక వేళ సరదా పరిధులు దాటితే అది ఒక్కోసారి పెను ప్రమాదాలకే దారి తీయవచ్చు. చాలా మంది జంతువులు కనబడితే
సరదా కోసం ఎన్నో చిలిపి పనులు చేస్తూ ఉంటాం. కాని ఆ సరదా శృతి మించకూడదు. ఒక వేళ సరదా పరిధులు దాటితే అది ఒక్కోసారి పెను ప్రమాదాలకే దారి తీయవచ్చు. చాలా మంది జంతువులు కనబడితే ఏదోలా ఆటపట్టిదాం అనుకుంటారు. ఒక్కోసారి అవి ఇచ్చే రిప్లై చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో పచ్చని పొలంలో ఓ బాలుడు గేదెకు ప్రపోజ్ చేశాడు. మోకాళ్లపై కూర్చుని గేదెకు ఓ గడ్డి బొకేను ఇచ్చి ప్రపోజ్ చేసాడు. అయితే గేదె అతన్ని చూసి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆ బాలుడు గేదెముందు డాన్స్ చేయడం ప్రారంభించాడు. బాలుడి డ్యాన్స్ చూసిన గేదె బొకే ఇచ్చావుగా.. డాన్స్ ఆపి బయలుదేరు అన్నట్టు అతడ్ని పొడుస్తున్నట్టుగా బెదిరించింది. దెబ్బకు ఆ బాలుడు భయంతో వెనక్కి తిరిగి చూసుకోకుండా పరిగెత్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను లక్షమందికి పైగా వీక్షించారు. తమదైనశైలిలో ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..