Nap At Office: హాయిగా ఆఫీసులోనే నిద్రపోవచ్చు..! ఇది కంపెనీ ఆఫర్‌..! మీరేమంటారు మరి..!

Updated on: May 16, 2022 | 8:12 AM

ఉద్యోగులు సంస్థలను వీడకుండా ఉండేందుకు కంపెనీలు వారికి ఆకర్షణీయమైన ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న తమిళనాడుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ తమ ఉద్యోగుల కోసం పెళ్లి సంబందాలు వెతికే పనికూడా పెట్టుకుంది. తాజాగా


ఉద్యోగులు సంస్థలను వీడకుండా ఉండేందుకు కంపెనీలు వారికి ఆకర్షణీయమైన ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న తమిళనాడుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ తమ ఉద్యోగుల కోసం పెళ్లి సంబందాలు వెతికే పనికూడా పెట్టుకుంది. తాజాగా బెంగళూరుకు చెందిన మరో కంపెనీ తన ఉద్యోగులకు ఆఫీసులో నిద్రపోయే అవకాశాన్ని కల్పించింది. అరగంట సేపు నిద్రపోవచ్చని ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది. బెంగళూరుకి చెందిన స్టార్టప్ వేక్‌ఫిట్ అనే కంపెనీ తన ఉద్యోగులకు ఆఫీసులో నిద్రపోయే అవకాశాన్ని కల్పించింది. పని సమయంలో అరగంట సేపు నిద్రపోయేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో వేక్‌ఫిట్‌ సంస్థ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా పలు కంపెనీలు ప్రశంసిస్తున్నాయి. ఉద్యోగులను ఆకట్టుకునేందుకు ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ డ్రీమ్11 పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా, లాక్‌డౌన్‌ అనంతరం ముంబైకి బదిలీ అయిన కంపెనీ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మూడు వారాల పాటు 5 స్టార్ హోటల్స్‌లో బస చేసేందుకు అవకాశం ఇచ్చింది. హెచ్‌ఆర్‌ఏ కింద లక్ష రూపాయలను కంట్రిబ్యూట్ చేసింది. ఈ పాలసీలతో తమ ఉద్యోగుల్లో మూడింట రెండు వంతుల మంది ఫిబ్రవరిలో ఆఫీసు నుంచే పని చేయడం ప్రారంభించినట్టు తెలిపింది. గ్రోసరీ స్టార్టప్ జాప్టో కూడా ఉద్యోగుల కోసం పలు రకాల ప్రయోజనాలు తీసుకొచ్చింది. ఉద్యోగులకు వెకేషన్ రియంబర్స్‌మెంట్‌ను ఇచ్చింది. దీని కింద ఉద్యోగులు లీవ్ తీసుకున్నా వేతనాన్ని చెల్లించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 16, 2022 08:12 AM
Loading...
Unable to load recommendations.
Follow Us