Kangaroo: అరెరే కంగారూ ఎంత పని చేసింది.. ముద్దుగా పెంచుకుంటే దాడి చేసి చంపింది..

|

Sep 21, 2022 | 9:52 AM

పెంపుడు కంగారూ దాడిలో యజమాని చనిపోయిన ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకొంది. 1936 తర్వాత ఆస్ట్రేలియాలో ఓ మనిషి కంగారూ


పెంపుడు కంగారూ దాడిలో యజమాని చనిపోయిన ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకొంది. 1936 తర్వాత ఆస్ట్రేలియాలో ఓ మనిషి కంగారూ దాడిలో మరణించడం ఇదే తొలిసారి. గాయాలతో పడి ఉన్న 77 ఏళ్ల వ్యక్తిని అతడి బంధువు గుర్తించి వైద్యసిబ్బందికి సమాచారం అందించారు. అయితే అక్కడకు చేరుకున్న అంబులెన్స్‌ సిబ్బందిని క్షతగాత్రుడి వద్దకు వెళ్లనీయకుండా కంగారూ అడ్డుపడింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి దాన్ని కాల్చిచంపారు. మరోపక్క ఆ క్షతగాత్రుడు కూడా చికిత్స పొందుతూ అక్కడే మరణించాడు. అప్పటికే అతడు గాయపడి 24 గంటలు దాటినట్లు అంచనా వేస్తున్నారు. దాడికి పాల్పడిన కంగారూ అతడి పెంపుడు జంతువని భావిస్తున్నారు.ఆస్ట్రేలియాలో దాదాపు 5 కోట్ల కంగారూలు ఉన్నాయి. ఇవి రెండు మీటర్ల ఎత్తు పెరిగి 90 కిలోగ్రాముల వరకు బరవు ఉంటాయి. పదునైన దంతాలు, గోళ్లు, శక్తిమంతమైన కాళ్లు ఉంటాయి. అది భయపడినప్పుడు అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us on