Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.! 16 ఏళ్ల బాలికపై 8 మంది గంజాయి బ్యాచ్‌ అత్యాచారం..

|

Aug 24, 2023 | 9:03 PM

హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది. ఈ క్రమంలో నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 16 ఏళ్ల బాలికపై పైశాచికంగా ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎనిమిదిమంది గంజాయు ముఠా బాలిక ఇంట్లో చొరబడి, కత్తులతో బాలికను బెదిరించి దారుణానికి పాల్పడ్డారు. మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ లాల్ బజార్ కు చెందిన బాలిక తల్లిదండ్రులు..

హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది. ఈ క్రమంలో నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 16 ఏళ్ల బాలికపై పైశాచికంగా ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎనిమిదిమంది గంజాయు ముఠా బాలిక ఇంట్లో చొరబడి, కత్తులతో బాలికను బెదిరించి దారుణానికి పాల్పడ్డారు. మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ లాల్ బజార్ కు చెందిన బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో 15 రోజుల క్రితం ఆమె సోదరుడితో కలిసి మీర్పేట్ లోని సమీప బంధువైన అక్క దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. బాలిక దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. తమ్ముడు ఫ్లెక్సీలు కట్టే పని చేస్తున్నాడు. ఆగస్టు 21 ఉదయం 9 గంటలకు బాలిక తన సోదరుడు మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఎనిమిది మంది నిందితులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. గంజాయి మత్తులో ఉన్న ఆ బృందంలోని నలుగురు బాలిక మెడపై కత్తి పెట్టారు భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగిలిన వారు ఆమె తమ్ముడితో పాటు అక్కడే ఉన్న మరో చిన్నారిని బెదిరించారు. నిందితుల్లో ముగ్గురు బాలికను కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో పరారైనట్లు బాలిక బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న బాధ్యతరాలి సోదరి మీర్‌పేట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం బాలికను సఖి కేంద్రానికి తరలించారు. అయితే ఈ కేసులో బాలిక నివాసం ఉండే భవనంలోని కింది అంతస్తులో ఉండే టైసన్, మంగళహాట్ కు చెందిన ఓ రౌడీ షీటర్ నిందితుల్లో ఉన్నట్లు బాధితురాలు సోదరుడు చెబుతున్నాడు. మరో ఇద్దరు నిందితులు తమ నివాసానికి సమీపంలో ఉంటారని పోలీసులకు వివరించాడు. బాలిక సోదరుడు ఇచ్చిన వివరాల ప్రకారం నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మిగతా వారిని గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...