కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్న 9 ఏళ్ల బాలిక.. ఏమైందని ఆరా తీయగా !!

Updated on: Sep 06, 2022 | 9:10 PM

కృష్ణాజిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆగిరిమల్లి మండలం వడ్లమాను గ్రామంలో నివశిస్తున్న ఓ బాలిక కొంతకాలంగా ముభావంగా ఉంటుంది.

కృష్ణాజిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆగిరిమల్లి మండలం వడ్లమాను గ్రామంలో నివశిస్తున్న ఓ బాలిక కొంతకాలంగా ముభావంగా ఉంటుంది. ఇంట్లో కూడా భయంభయంగా తిరుగుతుంది. ఏమైందా అని ఆరా తీయగా.. కుమార్తె చెప్పిన విషయం విని తల్లిదండ్రలు నిర్ఘాంతపోయారు. వివరాల్లోకి వెళ్తే.. వడ్లమాను గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక అదే ఊర్లో చదువుకుంటోంది. అయితే ఆ బాలిక నివశిస్తున్న ఇంటి ఓనర్ పుత్రరత్నంతో పాటు ఆ సమీప ప్రాంతంలో నివశించే మరో ఇద్దరు బాలురు ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూడ్డానికి అలవాటుపడ్డారు. ఈ క్రమంలో బాలికపై వారి కన్ను పడింది. ఆమెను మేడపైకి తీసుకెళ్లి.. కొద్ది రోజులుగా పోర్న్ వీడియోలు చూపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారు. విషయం ఎవరితోనైనా చెప్తే.. చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆ బాలిక ప్రవర్తనలో తేడా వచ్చింది. ఇంట్లో ఒంటరిగా కూర్చుంటుంది. చిన్న.. చిన్న విషయాలకు కూడా భయపడుతుంది. దీంతో అనుమానం వచ్చిన పేరెంట్స్ బాలికను నిలదీశారు. దాంతో బోరున విలపిస్తూ బాలిక అసలు విషయం చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఇంతలోనే పెద్ద మనుషులు రంగంలోకి దిగి.. రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

World Biggest Temple: ప్రపంచంలోనే ఇంత పెద్ద ఆలయం ఎక్కడా చూసి ఉండరు

అతిపెద్ద గ్రహాన్ని క‌నుగొన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌..

చికెన్ వింగ్స్ తిని బోన్స్ డెలివరీ చేసిన బాయ్ !! అందులో ఓ లెటర్ కూడా..

పంది తెచ్చిన ప్రమాదం.. అరక్షణంలో అంతా జరిగిపోయింది..

Published on: Sep 06, 2022 09:10 PM
Loading...
Unable to load recommendations.
Follow Us