AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Late Marriage Viral Video: లేటు వయస్సులో పెళ్లి.. ఆయనకు 73...ఆమెకు 26..! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

Late Marriage Viral Video: లేటు వయస్సులో పెళ్లి.. ఆయనకు 73…ఆమెకు 26..! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

Anil kumar poka
|

Updated on: Oct 17, 2021 | 9:24 PM

Share

Old Man Marriage: ఇద్దరు వదువరులు. ఆయనకు 73 ఏళ్ళు, ఆమెకు 26 ఏళ్ళు ఇద్దరికి మధ్య 47 ఏళ్ల వ్యత్యాసం. అయిన మనసులు కలిశాయి. పెళ్లి చేసుకోవలనుకున్నారు. ఇరు కుటుంబీకులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దగ్గరుండి మరి పెళ్లి చేశారు.

ఇద్దరు వదువరులు. ఆయనకు 73 ఏళ్ళు, ఆమెకు 26 ఏళ్ళు ఇద్దరికి మధ్య 47 ఏళ్ల వ్యత్యాసం. అయిన మనసులు కలిశాయి. పెళ్లి చేసుకోవలనుకున్నారు. ఇరు కుటుంబీకులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దగ్గరుండి మరి పెళ్లి చేశారు. ఈ వివాహం నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగామ్ గ్రామంలోని సాయిబాబా ఆలయంలో జరిగింది. ఇద్దరికి ఇది రెండో వివహమే.నిర్మల్ జిల్లా ముధోల్ మండలం చింత కుంట తండా కు చెందిన రాథోడ్ కిషన్ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి రిటైర్ అయ్యాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు.. అందరికి పెళ్లిలు అయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. కిషన్ భార్య గతంలో అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుండి ఆయన ఒంటరిగానే ఉంటున్నాడు. కుభీర్ మండలం రంజని తండా కు చెందిన సునీత భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈమెకు ఒక పాపా కూలి పని చేస్తూ పాపను పోషించుకుంటోంది.. బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో కిషన్ , సునీత పరస్పరం పరిచయం అయ్యారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొని విషయాన్ని తమ తమ కుటుంబ సభ్యులకు చెప్పగా వారి వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు.

మరిన్ని చదవండి ఇక్కడ : Shivalingam in potato: అద్భుతం.. బంగాళ దుంపలో దర్శనమిచ్చిన శివలింగాకృతి.. వీడియో వైరల్..

 Kerala Floods Live Video: దక్షిణ భారతానికి ఉప్పెన ముప్పు… పెరిగిన మృతుల సంఖ్య.. (లైవ్ వీడియో)

 Pawan Kalyan-Manchu Vishnu-Alai-Balai: పవన్‌ కళ్యాణ్ vs మంచు విష్ణు.. ఎడమొఖం.. పెడమొఖం.. అలయ్-బలయ్ ఎం జరిగింది..?(వీడియో)

 Most Eligible Bachelor: ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ థాంక్స్‌మీట్ లో ‘అఖిల్ అక్కినేని’ సందడి..(వీడియో)