పుట్టగానే పాస్‌పోర్ట్‌.. ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి

Updated on: Sep 12, 2026 | 5:50 PM

శ్రీకాకుళం జిల్లాకు చెందిన 13 రోజుల పసికందు అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇచ్ఛాపురానికి చెందిన వజ్రపు అగస్య ప్రిన్సీ పుట్టిన 13 రోజుల్లోనే పాస్‌పోర్ట్‌ పొందింది. ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఆమెను ‘యంగెస్ట్‌ పాస్‌పోర్ట్‌ హోల్డర్‌’గా గుర్తించింది. గతంలో 19 రోజుల పసికందు పేరిట ఉన్న రికార్డును ఈ చిన్నారి అధిగమించింది. అత్యవసరంగా బర్త్‌ సర్టిఫికేట్‌, బాల ఆధార్‌, పాస్‌పోర్ట్‌ ప్రక్రియను కుటుంబం వేగంగా పూర్తి చేసింది.

పుట్టగానే పూవు పరిమళిస్తుంది అన్నట్టుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ బుజ్జాయి అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. పుట్టిన 13 రోజుల వ్యవధిలోనే పాస్‌పోర్ట్ సాధించి ‘యంగెస్ట్ పాస్‌పోర్ట్ హోల్డర్’గా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వజ్రపు వెంకటేశ్ మనవరాలు వజ్రపు అగస్య ప్రిన్సీ ఈ ఘనత సాధించింది. గతంలో 19 రోజుల పసికందు పేరిట ఉన్న రికార్డును ఈ పాప అధిగమించడం విశేషం. వివరాల్లోకి వెళితే.. వెంకటేశ్ కుమారుడు ఆశిష్, కోడలు గీతామాధురి దంపతులు ఉద్యోగరీత్యా లండన్‌లో స్థిరపడ్డారు. గీతామాధురి రాజమహేంద్రవరంలో మే 30న అగస్య ప్రిన్సీకి జన్మనిచ్చారు. తిరిగి లండన్ వెళ్లాల్సి ఉండటంతో పాపకు పాస్‌పోర్ట్ అత్యవసరమైంది. దీంతో తల్లిదండ్రులు వెంటనే ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా జూన్ 1న బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారు. దాని ఆధారంగా జూన్ 2న ‘బాల ఆధార్’ కోసం దరఖాస్తు చేయగా, కేవలం రెండు రోజుల్లోనే జూన్ 4న ఆధార్ కార్డు అందింది. ఆ వెంటనే జూన్ 6న పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోగా, అన్ని ప్రక్రియలు పూర్తయి జూన్ 12న పాస్‌పోర్ట్ మంజూరైంది. అంటే పుట్టినప్పటి నుంచి కేవలం 13 రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దీనిని అధికారికంగా గుర్తించింది. పసి వయసులోనే ఈ రికార్డు సాధించడం పట్ల చిన్నారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..

Bigg Boss 10 Telugu News: బిగ్ బాస్‌ 10 – కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్‌

మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?

Mirzapur: మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్‌ దిశగా అడుగులు

అగ్ని పరీక్ష 2 కారణంగా… ప్రభుత్వ ఉద్యోగం పాయే..! పాపం రామకృష్ణ

Loading...
Unable to load recommendations.
Follow Us