వందే భారత్ స్లీపర్‌కు నో తత్కాల్‌..నో వెయిటింగ్‌ లిస్ట్‌!

Updated on: Nov 15, 2026 | 11:33 AM

వందే భారత్ స్లీపర్ రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి రైల్వే శాఖ కీలక నిబంధనలు ఉన్నాయి. ఈ రైళ్లలో తత్కాల్, RAC, వెయిటింగ్ లిస్ట్ టికెట్లు అందుబాటులో ఉండవు. కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారికే ప్రయాణానికి అనుమతి ఉంటుంది. టికెట్ రద్దు చేసుకుంటే ఎంత రీఫండ్ వస్తుంది, ఎన్ని గంటల ముందు క్యాన్సిల్ చేయాలి వంటి వివరాలు ప్రయాణికులు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ‘వందే భారత్ స్లీపర్’ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. అయితే సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే వీటి టికెట్ బుకింగ్, ప్రయాణ నిబంధనలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. సాధారణ రైళ్లలో చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకోవడానికి ఉపయోగపడే ‘తత్కాల్’ సదుపాయం వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఉండదు. ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ లోనే ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలి. అలాగే, ఇందులో RAC, వెయిటింగ్ లిస్ట్ లేదా పాక్షికంగా కన్ఫర్మ్ అయిన టికెట్లకు అసలు అనుమతి లేదు. కేవలం కన్ఫర్మ్ అయిన టికెట్లు ఉన్నవారే ప్రయాణించడానికి అర్హులు. ఈ రైళ్లను మొత్తం 16 కోచ్‌లతో గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. BEML మరియు చెన్నై ICF సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేశాయి. వందే భారత్ స్లీపర్ టికెట్ల రద్దు నిబంధనలు కూడా కఠినంగా ఉన్నాయి. ప్రయాణానికి 72 గంటల ముందు రద్దు చేస్తే 25% ఛార్జీపోను మిగతా డబ్బులు రీఫండ్ వస్తాయి. అదే 72 నుండి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50% డబ్బులు తిరిగి లభిస్తాయి. కానీ, ప్రయాణానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉంటే మాత్రం ఎలాంటి రీఫండ్ రాదు. ప్రస్తుతం హౌరా – కామాఖ్య, వారణాసి – న్యూఢిల్లీ, బెంగళూరు – ముంబై మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అభిమానాలు లేక కాదు, సందర్భాలు కుదరాలి కదా! దటీజ్ పవన్ నైజం!

ఆయన సంపాదన.. ఈమె పాకెట్ మనీతో సమానమా?

గాడ్ ఆఫ్ వార్’ రూమర్లకు.. నాగవంశీ దిమ్మతిరిగే కౌంటర్..

62 ఏళ్ల వయసులో రొమాంటిక్ ఫోజులు.. ప్రియురాలితో గోవిందా వైరల్ పిక్స్!

Loading...
Unable to load recommendations.
Follow Us