తిరుపతిలో మరో కొత్త నగరం.. అలిపిరి వద్ద రూ.2,750 కోట్లతో మెగా టౌన్‌షిప్

Updated on: Nov 22, 2026 | 7:09 PM

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల సౌకర్యార్థం, ఆలయ అవసరాల కోసం పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా తిరుపతిలో రూ.2,750 కోట్లతో భారీ ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్ నిర్మాణం ఆమోదం పొందింది. అలిపిరి నుంచి ఎస్వీ జూపార్క్ రోడ్డు పరిసరాల్లో ఈ ప్రాజెక్టును శ్రీవాణి ట్రస్ట్ నిధులతో చేపట్టనున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల సౌకర్యార్థం, ఆలయ అవసరాల కోసం పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా తిరుపతిలో రూ.2,750 కోట్లతో భారీ ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్ నిర్మాణం ఆమోదం పొందింది. అలిపిరి నుంచి ఎస్వీ జూపార్క్ రోడ్డు పరిసరాల్లో ఈ ప్రాజెక్టును శ్రీవాణి ట్రస్ట్ నిధులతో చేపట్టనున్నారు. భక్తులకు వసతి, యాత్రికుల సేవలు, ఆధునిక మౌలిక సదుపాయాలను ఒకేచోట కల్పించడమే దీని లక్ష్యం. మరోవైపు, వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 20 నుంచి 29 వరకు 10 రోజుల పాటు 8.34 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. సాధారణ భక్తులకు 92% ప్రాధాన్యత ఇవ్వనున్నారు. శ్రీవారి ఆలయానికి అవసరమైన పాలు, నెయ్యి కోసం రూ.7.5 కోట్లతో 500 దేశవాళీ ఆవులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇది ఆలయ అవసరాలకు స్వయం సమృద్ధిని సాధించడంలో సహాయపడుతుంది. పర్యావరణ పరిరక్షణకు, ఉద్యోగుల సంక్షేమానికి కూడా టీటీడీ ప్రాధాన్యతనిచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీలో 2,111 టీచర్ పోస్టులు..సబ్జెక్టుల వారీగా పోస్టుల లిస్ట్..ఇలా దరఖాస్తు చేసుకోండి

Hyderabad: హైదరాబాద్ ఆకాశంలో ఉల్కాపాతం.. కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యాలు

Published on: Nov 22, 2026 07:08 PM
Loading...
Unable to load recommendations.
Follow Us