పెళ్లి పీటలెక్కుతున్న త్రిష.. మరి ఈసారి ఏమౌతుందో వీడియో
స్టార్ హీరోయిన్ త్రిష వివాహ వార్తలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. చండీగఢ్‌కు చెందిన ఆస్ట్రేలియా వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి నిశ్చయమైందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. గతంలో వరుణ్ మనియన్‌తో నిశ్చితార్థం రద్దయిన తర్వాత, ప్రస్తుతం త్రిష చిరంజీవి విశ్వంభర, కరుప్పు చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లి వార్తలు మరోసారి వార్తల్లో నిలిచాయి. తాజాగా కోలీవుడ్ వర్గాల్లో త్రిష వివాహానికి సంబంధించిన వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది. గతంలో బిజినెస్ మ్యాన్ వరుణ్ మనియన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగినా, అది అనుకోకుండా రద్దైంది. ఆ తర్వాత తన కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టిన త్రిష, ఇప్పుడు తన తల్లిదండ్రులు చూసిన సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ నడుస్తోంది.తాజా సమాచారం ప్రకారం, చండీగఢ్‌కు చెందిన ఓ యువకుడితో త్రిష పెళ్లి సంబంధం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆ యువకుడు ఆస్ట్రేలియాలో స్థిరపడి వ్యాపారం చేస్తున్నాడని, ఇటీవల తన వ్యాపారాన్ని భారత్‌లోనూ విస్తరించాడని చెబుతున్నారు. ఇరు కుటుంబ పెద్దలు అంగీకరించడంతో త్రిష కూడా ఈ సంబంధానికి ఓకే చెప్పినట్లు కోలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
