Kurnool: ప్రాణం పోసిన వర్షం..! రైతుల్లో చిగురిస్తున్న ఆశలు.. వీడియో.
ర్నూలు జిల్లా తీవ్ర వర్షాభావంతో అల్లాడుతోంది. తాగు నీరుకు సైతం ప్రజలు అష్టకష్టాలూ పడుతున్నారు. మరోవైపు పంటలు ఎండిపోతున్నాయి. వాన నీటికోసం ఆకాశంవైపు మూగగా చూస్తున్నాయి పంటపొలాలు. ఈ క్రమంలో కరుణించిన వరుణుడు ఒక్కసారిగా జిల్లాలో కుండపోత కురిపించాడు. నగరంతోపాటు చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో ఉన్నట్టుండి కుండపోత వర్షం కురిసింది. దాదాపు గంటన్నర ఏకధాటిగా 120 మిల్లీమీటర్ల వర్షం కురిసి, పంటలకు ప్రాణం పోసింది.
కర్నూలు జిల్లా తీవ్ర వర్షాభావంతో అల్లాడుతోంది. తాగు నీరుకు సైతం ప్రజలు అష్టకష్టాలూ పడుతున్నారు. మరోవైపు పంటలు ఎండిపోతున్నాయి. వాన నీటికోసం ఆకాశంవైపు మూగగా చూస్తున్నాయి పంటపొలాలు. ఈ క్రమంలో కరుణించిన వరుణుడు ఒక్కసారిగా జిల్లాలో కుండపోత కురిపించాడు. నగరంతోపాటు చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో ఉన్నట్టుండి కుండపోత వర్షం కురిసింది. దాదాపు గంటన్నర ఏకధాటిగా 120 మిల్లీమీటర్ల వర్షం కురిసి, పంటలకు ప్రాణం పోసింది. జిల్లాలోని అనుకోని అతిథిలా వచ్చిన వర్షం రైతుల కళ్లల్లో ఆనందం నింపింది. కర్నూలు అర్బన్ లో 120 మిల్లీమీటర్లు, కర్నూలు నగరంలో 98 మిల్లీమీటర్లు, కర్నూల్ రూరల్ 58 క్రిష్ణగిరి 25 తుగ్గలి 17 చిప్పగిరి 13 మద్దికేర 11 ఓర్వకల్ మండలంలో ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కర్నూలు జిల్లాలో సగటున 13.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. హలహరి వి, హొలగొంద మండలాల్లో నవంబర్ 5న వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాలలో ఎక్కడా వాన జాడే కనపడలేదు. అకస్మాత్తుగా కురిసిన వర్షం పలు చిన్న పంటలకు ప్రాణం పోసింది. పప్పు, సెనగ, ధనియాలు జొన్న కంది లాంటి పంటలకు ఊపిరి పోసింది. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్లా వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ముందుగా వర్షాలు కురవాలని తాగునీటికీ పంటలకు ఇబ్బంది రాకుండా చూడాలని వానదేవుడిని కోరుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.