శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమలకు వెళ్లే రైళ్లు రద్దు..

Updated on: Nov 11, 2026 | 5:33 PM

తిరుమల శ్రీవారి దర్శనానికి రైలులో వెళ్లే భక్తులకు రైల్వే శాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. రేణిగుంట జంక్షన్ ఆధునీకరణ పనుల కారణంగా నవంబర్ 10 నుంచి డిసెంబర్ 27 వరకు పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ కూడా 27 రోజుల పాటు రద్దు కానుంది. ప్రయాణికులు ముందుగానే రైళ్ల వివరాలు తెలుసుకోవాలి.

తిరుమల శ్రీవారి దర్శనానికి రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. దక్షిణ కోస్తా రైల్వేకు కీలక ముఖద్వారమైన రేణిగుంట జంక్షన్‌లో ఆధునీకరణ పనులు చేపడుతుండటంతో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు జోనల్ అధికారి విజయ్ కిషన్ తెలిపారు. రేణిగుంట యార్డ్ ఆధునీకరణలో భాగంగా నూతనంగా నిర్మించిన బైపాస్ లైన్, అదనపు కిలోమీటర్ రైలు మార్గాల అనుసంధాన పనులను చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా నవంబరు 10 నుంచి డిసెంబర్ 27 వరకు రోజువారీ మరియు వీక్లీ రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. చెన్నై-తిరుపతి మధ్య నడిచే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను 27 రోజుల పాటు రద్దు చేశారు. అలాగే కడప-అరక్కోణం, తిరుచానూరు-అరక్కోణం, చెన్నై-తిరుచానూరు, గూడూరు-రేణిగుంట, నెల్లూరు-రేణిగుంట ప్యాసింజర్ రైళ్లను 48 రోజుల పాటు రద్దు చేశారు. తిరుపతి-విశాఖపట్నం మధ్య నడిచే డబుల్ డెక్కర్ రైలును డిసెంబర్ 9 నుంచి 26 వరకు రద్దు చేశారు. తిరుచానూరు నుంచి నాందేడ్, జల్నా, కాచిగూడ, చర్లపల్లి వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లను రెండు రోజులు రద్దు చేశారు. అలాగే రేణిగుంట-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 11, 12, 18, 19, 25 తేదీల్లో, తిరుపతి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్‌ 12, 13, 14, 19, 20, 21, 26, 27 తేదీల్లో 8 రోజుల పాటు రద్దు చేశారు. ముంబై నుంచి రేణిగుంట మీదుగా చెన్నై వెళ్లే రైళ్లను గుత్తి, అనంతపురం, ధర్మవరం మీదుగా నడుపుతున్నారు. గూడూరు-చెన్నై రైళ్లను సూళ్లూరుపేట మీదుగా దారి మళ్లించారు. అలాగే రేణిగుంట మీదుగా హౌరా, ఢిల్లీ, కన్యాకుమారి, త్రివేండ్రం, బెంగళూరు, మైసూర్ వెళ్లే రైళ్లు గుత్తి, ధర్మవరం మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తగిన విధంగా ప్రయాణ ప్రణాళికలు వేసుకోవాలని రైల్వే శాఖ కోరింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అబ్బో.. తేజ్‌ భార్య బ్యాగ్రౌండ్.. చాలా పెద్దదే.. ఆస్తులు కోట్లలోనే..

Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని.. తారక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు

‘శ్రీరాముడిగా’ సల్మాన్ ఖాన్.. 20 ఏళ్ల క్రితమే ‘రామాయణ’ సినిమా ప్రకటన.. కానీ…

పవన్ కల్యాణ్ వ్యక్తిగత వ్యవహారంపై.. వైసీపీ కీలక ప్రకటనలు..

సినిమా మార్కెటింగ్ పై.. హీరోల, ప్రొడ్యూసర్ల తీరుపై.. RGV మార్క్‌ విశ్లేషణ!

Loading...
Unable to load recommendations.
Follow Us