Rains in AP: ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో కూడా.!

|

Jul 27, 2024 | 4:18 PM

తెలుగురాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ కేంద్రం అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో బలహీనపడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, అలాగే రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలుగురాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ కేంద్రం అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో బలహీనపడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, అలాగే రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇటు తెలంగాణలోనూ రెండురోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వద్ద అల్పపీడనం కేంద్రీకృతమైందని.. ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్‌ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటలు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on