WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే సెక్యూరిటీ ఫీచర్లు!

Updated on: Sep 01, 2026 | 3:57 PM

వాట్సాప్ యూజర్ల భద్రతను మరింత పెంచేందుకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొచ్చింది. ఇకపై ఒకేసారి బహుళ పాస్‌కీలను యాడ్ చేసుకునే అవకాశం కల్పించింది. టూ-స్టెప్ వెరిఫికేషన్‌లో ఆరు అంకెల పిన్‌కు బదులుగా అక్షరాలు, సంఖ్యలు, స్పెషల్ క్యారెక్టర్లతో బలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవచ్చు. అలాగే గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌పై అదనపు సమాచారాన్ని కూడా అందించనుంది.

వాట్సాప్ యూజర్ల భద్రతను మరింత పెంచేందుకు అద్భుతమైన కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకువచ్చింది. ఇకపై యూజర్లు తమ ఖాతా లాగిన్ కోసం కేవలం ఒక్క పాస్‌కీ మాత్రమే కాకుండా, ఏకకాలంలో బహుళ పాస్‌కీలను యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి వేర్వేరు డివైజ్‌లను వాడేవారికి లాగిన్ ప్రక్రియ మరింత సులభంగా, సురక్షితంగా మారుతుంది. ఇక టూ-స్టెప్ వెరిఫికేషన్ విధానంలోనూ వాట్సాప్ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కేవలం ఆరు అంకెల పిన్ నంబర్ మాత్రమే సెట్ చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు దాని స్థానంలో అక్షరాలు, సంఖ్యలు, స్పెషల్ క్యారెక్టర్లతో కూడిన పూర్తి స్థాయి బలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ వాట్సాప్ అకౌంట్‌ను హ్యాకర్లు సులభంగా ఊహించడం లేదా క్రాక్ చేయడం వారికి అసాధ్యం అవుతుంది. అలాగే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను పరిచయం చేశారు. మన కాంటాక్ట్‌లో లేని నంబర్ల నుంచి కాల్స్ వచ్చినప్పుడు.. ఆ నంబర్ వేరే దేశానిదా లేక మనతోపాటు ఏవైనా కామన్ వాట్సాప్ గ్రూపుల్లో ఉందా అనే వివరాలను స్క్రీన్ పైనే చూపిస్తుంది. ఈ అదనపు సమాచారం ద్వారా ఆ కాల్ రిసీవ్ చేసుకోవాలో లేదో యూజర్లు ముందే నిర్ణయించుకోవడానికి ఎంతో సహాయపడుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ లేడీ డైరెక్టర్ నుంచి సూర్య బతికిపోతే.. యశ్ దొరికేశాడు

బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ఫైనల్‌ సెలబ్రిటీలు వీరే? లిస్ట్‌ చూస్తే మతిపోవడం పక్కా

Loading...
Unable to load recommendations.
Follow Us