టీఆర్ ఫైలింగ్‌లో ‘క్లాడ్ ఏఐ’ హవా.. సీఏను మించిన అద్భుతమైన పని తీరు!

Updated on: Jun 23, 2026 | 8:41 PM

ఐటీఆర్ ఫైలింగ్ సీజన్‌లో పన్ను చెల్లింపుదారులు క్లాడ్ ఏఐ వంటి కృత్రిమ మేథస్సు సాధనాలను వినియోగిస్తున్నారు. ఫారం-16 విశ్లేషణ, ఏఐఎస్ వివరాల పరిశీలన, పన్ను లెక్కల వంటి క్లిష్టమైన పనులను సులభతరం చేస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. అయితే వ్యక్తిగత ఆర్థిక సమాచారం భద్రతపై జాగ్రత్తలు తీసుకుంటూ, తుది ఫైలింగ్‌కు ముందు నిపుణుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ సీజన్ ఊపందుకున్న వేళ, పన్ను చెల్లింపుదారులు సరికొత్త సాంకేతికత వైపు అడుగులు వేస్తున్నారు. ఆదాయపు పన్ను నిబంధనలు-2026 మార్పుల నేపథ్యంలో, ఆంత్రోపిక్ సంస్థకు చెందిన ‘క్లాడ్ ఏఐ’ సాయంతో ఐటీఆర్ ఫైలింగ్‌ను అత్యంత సులభంగా పూర్తి చేస్తున్నట్లు పలువురు టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు. క్లాడ్‌ ఏఐ పనితీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ పక్కన కూర్చుని సలహాలు ఇచ్చినట్లుగా ఉందని వారు ప్రశంసిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ నిపుణుడు ఉద్దేశ్య కుమార్ క్లాడ్ ఏఐ యాప్ ద్వారా తన ఐటీఆర్-1ను సులభంగా ఫైల్ చేశారు. ఫారం 16ను విశ్లేషించడం, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ వివరాలను సరిచూడటం వంటి సంక్లిష్ట పనులను ఈ ఏఐ క్షణాల్లో చేసిందని ఆయన తెలిపారు. అలాగే, అమెజాన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ సూద్ కూడా పన్నుల విధానంపై అవగాహన పెంచుకోవడానికి, మధ్యవర్తులపై ఆధారపడటం తగ్గించుకోవడానికి ఈ ఏఐ అద్భుతంగా ఉపయోగపడిందని పేర్కొన్నారు. ఈ ఏఐ వినియోగంపై ప్రశంసలు వస్తున్నప్పటికీ, ఆర్థిక సమాచార భద్రతపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము డిఫాల్ట్‌గా యూజర్ డేటాను ట్రైనింగ్ కోసం వాడబోమని ఆంత్రోపిక్ సంస్థ స్పష్టం చేసింది. ఏది ఏమైనప్పటికీ, ఏఐని కేవలం ఒక సహాయకారిగా మాత్రమే వాడుకుంటూ, ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్లాస్ 12 తర్వాత చదువు ఆపేయండి! సంచలనంగా వ్యాపారవేత్త కామెంట్

ఏఐ వల్ల ఈ ముప్పు కూడా ఉందా? ఆలోచించడం మానేస్తే ప్రమాదమంటున్న నిపుణులు

ఈ డెలివరీ గర్ల్‌ వేరే లెవల్‌..? ఖుష్బూ కథకు సెల్యూట్!

కళ్లు చెదిరేలా క్యాబ్‌ డ్రైవర్ సంపాదన..? వైరల్ డ్రైవర్ కథ

సూరత్ మహిళ వింత దొంగతనం.. యజమాని షాక్!

Follow Us