iPhone Alert: నిన్న శాంసంగ్‌., ఇవాళ యాపిల్.. యూజర్లకు కేంద్రం అలర్ట్.!

|

Dec 20, 2023 | 5:29 PM

ఇటీవలే శామ్‌సంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14 ఓఎస్‌తో పని చేసే శాంసంగ్‌ స్మార్ట్ ఫోన్ల లో భద్రతా పరమైన సమస్య ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ఐటీ శాఖ.. దీని వల్ల వ్యక్తులకు తెలియకుండానే వారి వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వెంటనే తమ శాంసంగ్ స్మార్ట్‌ ఫోన్‌ లేటెస్ట్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌ చేసుకోవాలని రెండు రోజుల క్రితం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెర్ట్‌ ఇన్‌ సూచించింది.

ఇటీవలే శామ్‌సంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14 ఓఎస్‌తో పని చేసే శాంసంగ్‌ స్మార్ట్ ఫోన్ల లో భద్రతా పరమైన సమస్య ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ఐటీ శాఖ.. దీని వల్ల వ్యక్తులకు తెలియకుండానే వారి వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వెంటనే తమ శాంసంగ్ స్మార్ట్‌ ఫోన్‌ లేటెస్ట్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌ చేసుకోవాలని రెండు రోజుల క్రితం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెర్ట్‌ ఇన్‌ సూచించింది. తాజాగా యాపిల్‌ యూజర్ల కు కూడా ఇదే తరహా హై రిస్క్‌ అలర్ట్‌ ఇచ్చింది.

యాపిల్‌ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ‘సెర్ట్ ఇన్‌’ తాజాగా తెలిపింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది. ఐఫోన్‌, యాపిల్‌ వాచ్‌, మ్యాక్‌ బుక్‌, ఐపాడ్‌, యాపిల్‌ టీవీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లతోపాటు సఫారీ బ్రౌజర్‌లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. ఆయా ఉత్పత్తులను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని హెచ్చరించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.