Hair Fall: ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!

Updated on: Mar 05, 2026 | 12:38 PM

ప్రస్తుతం జుట్టు రాలడం సాధారణ సమస్య. దీనికి నిపుణులు ఉసిరికాయ మురబ్బాను చక్కని పరిష్కారంగా సూచిస్తున్నారు. ఈ సులభమైన రెసిపీ జుట్టు రాలడాన్ని అరికట్టడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. కేవలం ఆహారంతోనే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో హెయిర్‌ ఫాల్‌ అనేది కామన్‌ అయిపోయింది. కారణం ఏదైనా వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోవడం సాధారణమైపోయింది. ఈ సమస్యతో చాలామంది సతమతమవుతూ.. దిగులు చెందుతూ ఉంటారు. అలాంటివారికోసం నిపుణులు ఒక చక్కని పరిష్కారం సూచిస్తున్నారు. అదేంటంటే.. కేవలం ఆహారంతో జుట్టురాలడాన్ని అరికట్టే మార్గం చెబుతున్నారు. అదేంటో చూద్దాం. ప్రకృతి ప్రసాదించిన ఉసిరికాయతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. ఉసిరికాయను సంజీవనిగా చెబుతారు. ఈ ఉసిరికాయ అనేక ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునే జుట్టు సమస్యకు కూడా ఉసిరికాయలతోనే చెక్‌పెట్టే సులభమైన మార్గం సూచిస్తున్నారు. అదే ఉసిరికాయ మురబ్బా. దీనిని తయారుచేసుకోవడం కూడా చాలా ఈజీ. ఉసిరికాయ మురబ్బా తయారు చేసుకోడానికి అరకిలో మంచి ఉసిరికాయలు తీసుకోండి.. అలాగే అరకిలో బెల్లం తీసుకోండి. ఈ ఉసిరికాయలను శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించండి. ఈ ఉడికిన ఉసిరికాయలను మెత్తగా తురిమి పెట్టుకున్న అరకేజీ బెల్లం వేసి సన్నని మంటమీద ఉడికించండి. మధ్యలో కలుపుతూ ఉండండి. ఉసిరి కాయలకు బెల్లం పాకం తోడై జ్యూసీగా తయారవుతాయి. వీటిని గింజలు తీసేసి, ముక్కలుగా చేసి కూడా వేసుకోవచ్చు. దించేముందు ఒక టీ స్పూన్‌ యాలకుల పొడి వేసి బాగా కలపండి. అంతే ఉసిరికాయ మురబ్బా రెడీ అయిపోతుంది. ఇది జుట్టు రాలే సమస్యను అరికట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు, గొంతునొప్పి, జలుబు కూడా తగ్గుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టురాలిపోతుందని దిగులు పడకుండా ఈ ఉసిరికాయ మురబ్బాని ప్రయత్నించండి. అయితే ఈ ఉసిరికాయ అందరికీ పడొచ్చు.. పడకపోవచ్చు.. దీనిని అనుసరించేముందు మీ వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా

Rare Bird: జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది

Dry Fruit Price: యుద్ధం ఎఫెక్ట్‌.. ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్‌ ధర

మ్యారేజెస్‌ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి.. కారణం ఆ ఒక్క దానివల్లే

EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖరారు..

Follow Us