శ్రేయస్ అయ్యర్ ఇంటి అద్దె రూ.7.14 కోట్లు
Shreyas Iyer ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న అత్యంత విలాసవంతమైన ఆర్టేసియా టవర్‌లో మూడు సంవత్సరాల లీజ్‌పై లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఈ ఒప్పందం మొత్తం విలువ రూ.7.14 కోట్లు. సుమారు 3,875 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ నివాసంలో నాలుగు కార్ల పార్కింగ్ సదుపాయం ఉంది. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం ఈ డీల్ చర్చనీయాంశంగా మారింది.
భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబైలో ఓ విలాసవంతమైన నివాసాన్ని అద్దెకు తీసుకున్నాడు. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన వర్లీలోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్‌లో మూడు సంవత్సరాల లీజ్ ఒప్పందంతో ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మొత్తం లీజ్ ఒప్పంద విలువ రూ.7.14 కోట్లు. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ డీల్ కోసం అతను రూ.74 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు రూ.1.84 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం. వర్లీలోని విలాసవంతమైన ఆర్టేసియా ప్రాజెక్టులో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ సుమారు 3,875 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. నాలుగు కార్లను పార్కింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ముంబైలోని అత్యంత సంపన్న నివాస ప్రాంతాల్లో ఒకటైన వర్లీ, బాంద్రా-వర్లీ సీ లింక్ ద్వారా నగరంలోని ప్రధాన ప్రాంతాలకు సులభంగా చేరుకునే సదుపాయం ఉండటంతో ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివసించేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఒప్పందం ప్రకారం మొదటి సంవత్సరానికి నెలకు రూ.18.5 లక్షల అద్దె చెల్లించాలి. రెండో సంవత్సరంలో అద్దె సుమారు 7 శాతం పెరిగి రూ.19.79 లక్షలకు చేరుకోనుండగా, మూడో సంవత్సరంలో అది రూ.21.18 లక్షలకు పెరుగుతుంది. మూడు సంవత్సరాల్లో మొత్తం రూ.7.14 కోట్లు అద్దెగా చెల్లించాలి. శ్రేయస్ అయ్యర్ ఇటీవలే భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. కెప్టెన్‌గా ఎంపికైన కొద్ది రోజులకే ముంబైలోని ఈ లగ్జరీ నివాసాన్ని అద్దెకు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయ్యర్‌కు ఇప్పటికే ముంబైలో విలాసవంతమైన సొంత ఇల్లు ఉంది. 2020లో అయ్యర్ రూ.12 కోట్లతో నాలుగు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !
క్లీనర్, కార్ వాషర్‌గా చిన్నా చితకా పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
