AP Elections: మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?

Updated on: Nov 05, 2026 | 1:57 PM

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. ఓటర్లు బోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధ మహిళ నిలబడలేని స్థిలో, నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది. దీంతో ఆమెను చూసిన ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేతులతో ఎత్తుకొని మరి పోలీంగ్ బూత్ వద్దకు తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా చేశాడు.

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధ మహిళ నిలబడలేని స్థిలో, నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది. దీంతో ఆమెను చూసిన ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేతులతో ఎత్తుకొని మరి పోలీంగ్ బూత్ వద్దకు తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా చేశాడు.

కృష్ణా జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు మానవత్వాన్ని చాటుకున్నారు. గన్నవరం జడ్పీ బాయ్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చిన ఓ వృద్ధ మహిళ నిలబడలేని పరిస్థితిలో ఉండటాన్ని గమనించి వెంటనే స్పందించారు.
వృద్ధురాలికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన చేతులతో ఎత్తుకుని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లి, ఆమె ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించారు. విధి నిర్వహణతో పాటు వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలిచిన హెడ్ కానిస్టేబుల్ నాగరాజు సేవలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ సహకరిస్తోందని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.

Published on: Nov 05, 2026 01:56 PM
Loading...
Unable to load recommendations.
Follow Us