Sathya Sai Birthday: హైదరాబాద్‌లో ఘనంగా సత్యసాయి జన్మదిన వేడుకలు.. 1000 మందికి అన్నదానం.
ప్రేమించండి... ప్రేమను పంచండి... అంటూ... ప్రపంచానికి ప్రేమ సందేశం ఇచ్చి... అందరినీ ప్రేమ జగత్తులోకి తీసుకుపోయారు సత్యసాయిబాబా. ఈ దేశం నీకు ఏమి ఇచ్చింది అని కాకుండా... ఈ దేశానికి నేను ఏమి ఇచ్చాను అనే తత్వం బాబాలో కనిపిస్తుంది. నిత్యం దీనులకు అండగా నిలిచిన బాబా... సేవాభావననే జీవన విధానంగా మార్చుకొని... కోట్ల మందికి ఆదర్శంగా నిలిచారు. సత్యసాయి బాబా... తన కరుణ, ప్రేమరసంతోనే... ఎంతోమంది భక్తుల శారీరక, మానసిక సమస్యలను రూపుమాపారు.
ప్రేమించండి… ప్రేమను పంచండి… అంటూ… ప్రపంచానికి ప్రేమ సందేశం ఇచ్చి… అందరినీ ప్రేమ జగత్తులోకి తీసుకుపోయారు సత్యసాయిబాబా. ఈ దేశం నీకు ఏమి ఇచ్చింది అని కాకుండా… ఈ దేశానికి నేను ఏమి ఇచ్చాను అనే తత్వం బాబాలో కనిపిస్తుంది. నిత్యం దీనులకు అండగా నిలిచిన బాబా… సేవాభావననే జీవన విధానంగా మార్చుకొని… కోట్ల మందికి ఆదర్శంగా నిలిచారు. సత్యసాయి బాబా… తన కరుణ, ప్రేమరసంతోనే… ఎంతోమంది భక్తుల శారీరక, మానసిక సమస్యలను రూపుమాపారు. సత్యసాయిబాబా 98వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని జీడిమెట్ల శ్రీసత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. హైదరాబాదులోని శ్రీ సత్యసాయి సేవా సమితి జీడిమెట్ల ఆధ్వర్యంలో స్థానిక ఐడిపీఎల్ బస్ స్టాప్ వద్ద నవంబరు 19న మహా నారాయణ సేవ నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారు 1000 మందికి అన్నదానం ఏర్పాటు చేసినట్లు సత్యసాయి సేవా సంస్థ సభ్యులు తెలిపారు. సత్య సాయి బాబా జన్మదిన వేడుకల్లో భాగంగా నవంబర్ 19న మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి సేవకులు పెద్దలు మహిళలు భక్తులు పాల్గొన్నారు. అలాగే నవంబర్ 22న సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు వస్త్ర దానం చేస్తారు. నవంబర్ 23 సత్యసాయిబాబా జన్మదినోత్సవం పురస్కరించుకొని తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాతం, నగర సంకీర్తన సేవలు సాయంత్రం సంగీత విభావరి, జ్వాలా ఉత్సవం, భజన, మంగళహారతి నిర్వహిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.