పెళ్లికి ఒప్పుకోలేదని.. నా కూతురుకి HIV ఎక్కించాడు
ఘట్కేసర్ రమణి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి రద్దు చేయడంతో కోపంతో మనోహర్ రమణికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించాడని తండ్రి చిరంజీవి వెల్లడించారు. ఈ విషయం బయటపెట్టవద్దని మనోహర్ తమ్ముడు వేణు బెదిరించగా, మనోహర్ కుటుంబం తప్పుడు ప్రచారం చేయడంతో తీవ్ర మనస్థాపంతో రమణి ఆత్మహత్య చేసుకుందని తండ్రి తెలిపారు.
మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ రమణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి రద్దు చేసుకున్నదనే కోపంతో నిందితుడు మనోహర్, రమణికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించినట్లు రమణి తండ్రి చిరంజీవి పేర్కొన్నారు. మనోహర్‌కు హెచ్‌ఐవీ పాజిటివ్ అని, రమణికి నెగిటివ్ రావడంతోనే పెళ్లి రద్దయిందని తెలిపారు. రక్తం ఎక్కించిన విషయం బయటకు చెప్పవద్దని మనోహర్ తమ్ముడు వేణు రమణిని బెదిరించాడని, ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు కూడా పంపాడని విచారణలో తేలింది. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత, మనోహర్ కుటుంబ సభ్యులు రమణిపై తప్పుడు ప్రచారం చేశారని, దీనివల్ల తీవ్ర మనస్థాపానికి గురైన రమణి ఆత్మహత్య చేసుకుందని రమణి తండ్రి చిరంజీవి వెల్లడించారు. ఈ కేసులో మనోహర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Undavalli Caves: బయటపడిన ఉండవల్లి గుహల రహస్యాలు ఇవే
Gas Cylinder Blast: టపాసుల్లా పేలిన గ్యాస్ సిలిండర్లు.. ఇళ్లు బుగ్గిపాలు
Iran Oil Tankers: భారత్‌కు చేరిన ఇరాన్ ఆయిల్ ట్యాంకర్‌లు
రైలులో 163 మంది చిన్నారుల అక్రమ రవాణా
బుక్ చేసి వారమైనా గ్యాస్ సిలిండర్ రాలేదా? ఘోస్ట్ డెలివరీయే కారణమా?