‘విజయ్’ పేరును స్టాలిన్’గా మార్చిన AI.. నెట్టింట రచ్చ!
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఏఐ అనువాద లోపం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు సీఎంఓ ఖాతాలో విజయ్ పేరుతో ఉన్న తమిళ పోస్టును ఇంగ్లీష్‌లోకి అనువదించగా, ఆయన పేరుకు బదులుగా ఎం.కె. స్టాలిన్ అని కనిపించినట్లు కథనాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీ, విజయ్ భేటీకి సంబంధించిన పోస్టులో జరిగిన ఈ పొరపాటుపై నెటిజన్లు మీమ్స్‌తో స్పందిస్తున్నారు. ఈ ఘటన ఆటోమేటిక్ అనువాద వ్యవస్థల ఖచ్చితత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ఆటోమేటిక్ అనువాదంలో జరిగిన ఒక పెద్ద పొరపాటు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ లేదా ప్రముఖ సినీ నటుడు, TVK అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌లకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తరచూ వార్తలు వస్తుంటాయి. అయితే, ఎక్స్ AI చేసిన తప్పు మూలంగా తమిళనాడు సీఎంగా తమిళంలో ఉన్న పేరు ఇంగ్లీష్‌లోకి వచ్చేసరికి మారిపోయింది. అక్టోబరు 10న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెన్నైలో టీవీకే నేత విజయ్ను కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోను తమిళనాడు సీఎంఓ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. తమిళంలో రాసిన ఆ పోస్ట్‌లో “మన తమిళనాడు ముఖ్యమంత్రి తిరు. జోసెఫ్ విజయ్” అని పేర్కొన్నారు. అయితే, ఇతర భాషల యూజర్లు అర్థం చేసుకునేందుకు ఉన్న ‘షో ట్రాన్స్లేషన్’ బటన్ క్లిక్ చేయగానే రీడర్లకు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఇంగ్లీష్ అనువాదం కనిపించింది. తమిళంలో ‘విజయ్’ అని ఉంటే, ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో మాత్రం ‘M. K. Stalin’ అని ప్రత్యక్షమైంది. ఫోటోలో ఉన్నది విజయ్, టెక్స్ట్ రాసింది CMO అయినా.. ఎక్స్ AI మాత్రం తమకు తెలిసిన సీఎం స్టాలిన్ ఒక్కరే అన్నట్లు తప్పుగా అనువదించేసింది. ఈ అనువాద లోపం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో మరుసటి రోజు ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటనకు రాగా, విమానాశ్రయంలో విజయ్ స్వాగతం పలికిన ఫోటోను సీఎంఓ ఖాతాలో షేర్ చేశారు. అయితే పాత పోస్ట్ వివాదం కావడంతో అప్రమత్తమైన అడ్మిన్లు, ఈసారి ఆ పోస్ట్‌కు ‘షో ట్రాన్స్లేషన్’ ఆప్షన్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, ఇప్పటికీ అక్టోబర్ 10 నాటి రాహుల్-విజయ్ భేటీ పాత పోస్ట్‌ను ఓపెన్ చేసి అనువాదం నొక్కితే ‘స్టాలిన్’ పేరే వస్తుండడం గమనార్హం. ఎక్స్ AI అనువాద తీరుపై నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
APSRTC గుడ్ న్యూస్.. విశాఖ To భోగాపురం.. కొత్తగా నెలవారీ పాస్‌లు
ఇ-కామర్స్ డెలివరీ సర్వీస్‌లపై 5% జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ!
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!
PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్, విత్‌డ్రా!