త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!

Updated on: Aug 05, 2026 | 5:53 PM

డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో వివాదానికి దారితీశాయి. కావేరి జలాల నిరసన సభలో చేసిన వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించినవేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ, టీవీకే నేతలు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషను ఉద్దేశించి చేసిన ద్వంద్వార్థ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తంజావూరులో కావేరి జలాల కోసం నిర్వహించిన నిరసన సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌పై ఉదయనిధి విమర్శలు చేస్తున్న సమయంలో, సభలోని కొందరు ‘త్రిష.. త్రిష’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రసంగం ఆపి నవ్విన ఉదయనిధి.. “నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా,… అక్కడికి చేరాలి” అంటూ వ్యాఖ్యానించారు. అయితే వారిని వెంటనే వారించకుండా, వారితో కలిసి ఉదయనిధి స్టాలిన్ నవ్వినట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. తాను కావేరి జలాల గురించే అన్నానని ఉదయనిధి కవర్‌చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ వ్యాఖ్యలు త్రిషను ఉద్దేశించినవేనని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బిజెపి సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్ ఉదయనిధి స్టాలిన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయాల్లో మహిళలను, వారి వ్యక్తిగత జీవితాలను లాగడం సరైన పద్ధతి కాదని ఆమె విమర్శించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం ప్రజాప్రతినిధులకు తగదని, రాజకీయ విమర్శలు వ్యక్తిగత స్థాయికి వెళ్లకూడదని పేర్కొన్నారు. బీజేపీ తమిళనాడు విభాగం ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఘటనపై టీవీకే ఎమ్మెల్యే రేవంత్ చరణ్ మాట్లాడుతూ.. ఉదయనిధి వ్యాఖ్యలు అసహ్యకరంగా ఉన్నాయని, డీఎంకే రాజకీయ సంస్కృతి దిగజారిపోయిందని విమర్శించారు. అంతేకాకుండా, మహిళలను అగౌరవపరిచిన ఉదయనిధిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ రాసింది. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు ‘సుప్రీం’ గ్రీన్ సిగ్నల్!

రూ.8000 కోట్ల డిపాజిట్లు.. ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్‌లోనే…!

వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం! అది నీడ కాదు.. పాము పడగే! “ట్రీ ఆఫ్ డెత్” స్టోరీ!

చిలగడదుంపా అని తీసిపారేయకండి.. ఆ సమస్యకు అద్భుత నివారిణి!

Loading...
Unable to load recommendations.
Follow Us