Watch Video: కాంగ్రెస్ ఉన్నంతకాలం ఆ విషయంలో ఎవరూ వేలుపెట్టలేరు.. మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు

|

Apr 29, 2024 | 3:54 PM

జూన్ 2 తర్వాత హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వ్యాఖ్యల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న డిమాండ్ వచ్చిందని.. అయితే దీనికి సోనియా గాంధీ అంగీకరించలేదన్నారు.

జూన్ 2 తర్వాత హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వ్యాఖ్యల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న డిమాండ్ వచ్చిందని.. అయితే దీనికి సోనియా గాంధీ అంగీకరించలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉన్నంతకాలం హైదరాబాద్‌లో ఎవరు వేలు పెట్టినా చూస్తూ ఊరుకోబోమన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తారం కేటీఆర్‌ మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ రగల్చాలని చూస్తున్నారని ఆరోపించారు పొన్నం.

కాగా గ్రామాల్లోకి వస్తోన్న బీజేపీ నేతల్ని రిజర్వేషన్లపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. రిజర్వేషన్లు రద్దు చేయబోమని చెబుతున్న బీజేపీ నేతలు పెంచుతామని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు.