Indiramma Illu: ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లతో పాటు, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిచ్చారు. ఇందిరా మహిళా శక్తి, మహాలక్ష్మి యోజనల ద్వారా స్వయం సహాయక బృందాలను పారిశ్రామికవేత్తలుగా మార్చడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలతో గణనీయమైన ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం వంటి పథకాల విజయాలను వివరించారు.
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేసిన ప్రసంగం రాష్ట్ర పురోగతి, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించింది. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ స్పష్టం చేశారు. “ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు” అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక బృందాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ బృందాలు సౌరశక్తి ప్లాంట్ల నిర్వహణ నుండి క్యాంటీన్ల వరకు వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్నాయి. గ్రామీణ మహిళలు రాష్ట్ర ప్రగతికి చోదక శక్తులుగా మారారని గవర్నర్ ప్రశంసించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Follow Us