Telangana: రైతు బంధుపై సర్కార్ స్పష్టత ఇవ్వాలి.. హరీశ్ రావు డిమాండ్

|

Dec 09, 2023 | 2:28 PM

రైతుబంధు నిధుల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం రైతులకు క్లారిటీ ఇవ్వాలని హరీశ్ రావు అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతుబంధు మొత్తాన్ని రూ. 15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని చెప్పారు. డిసెంబర్ 9న రైతుబంధు నిధులు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. కానీ ఈ రోజు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదని హరీశ్ రావు అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి వడ్లను ఎప్పుడు కొనుగోలు చేస్తుందో స్పష్టత ఇవ్వాలని కోరారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. తాము అధికారంలోకి వస్తే బోనస్‌ ఇచ్చి మరీ వడ్ల కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. ఇప్పుడు రైతులు వడ్లను అమ్ముకునేందుకు ఎదురు చూస్తున్నారని.. ప్రభుత్వం ఈ విషయంలో రైతులకు ఇచ్చిన హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

రైతుబంధు నిధుల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం రైతులకు క్లారిటీ ఇవ్వాలని హరీశ్ రావు అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతుబంధు మొత్తాన్ని రూ. 15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని చెప్పారు. డిసెంబర్ 9న రైతుబంధు నిధులు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. కానీ ఈ రోజు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదని హరీశ్ రావు అన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

Follow us on