PM-KISAN: రైతులకు దసరా ధమాకా.. ఆ రోజే అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడతపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 చొప్పున మూడు విడతల్లో రూ.2,000 చొప్పున కేంద్రం అందిస్తోంది. 2026లో 23వ విడతను జూన్ 20న విడుదల చేసినట్లు అధికారిక పోర్టల్ వెల్లడించింది. తదుపరి విడతకు అర్హత పొందాలంటే e-KYC పూర్తి చేయడంతో పాటు ఆధార్ అనుసంధానం, భూమి వివరాల సీడింగ్ తప్పనిసరి.
దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. దసరా పండుగ కానుకగా అక్టోబర్‌లోనే లబ్ధిదారులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కేంద్రం సన్నాహాలు పూర్తి చేస్తోంది. అక్టోబర్ 20న దసరా పండుగ పురస్కరించుకుని, పండక్కి ముందే అంటే అక్టోబర్ 17వ తేదీన పీఎం కిసాన్ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విడతలో అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రూ.2,000 జమ కానున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఈ దసరా పండుగ రెట్టింపు సంతోషాన్ని ఇవ్వనుంది. ఏపీ ప్రభుత్వం ఇచ్చే ‘అన్నదాత సుఖీభవ’ సొమ్ము రూ.4,000, పీఎం కిసాన్ రూ.2,000 కలిపి మొత్తం రూ.6,000 ఒకేసారి ఏపీ రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే ఈ నిధులు ఎలాంటి అంతరాయం లేకుండా జమ కావాలంటే రైతులు కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ ద్వారా గానీ, సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాల్లో గానీ ఇ-కేవైసీ పూర్తి చేయాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్, NPCI మ్యాపింగ్ పూర్తయి ఉండటంతో పాటు భూమి వివరాలు పీఎం కిసాన్ పోర్టల్‌తో మ్యాప్ అయి ఉండటం తప్పనిసరి. ఈ ప్రక్రియలు పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే నిధులు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anant Ambani: ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!
అమరావతిలో అద్భుత నిర్మాణాలు.. ఐకానిక్ టవర్ల వెనుక ఇంజినీరింగ్ అద్భుతాలు
