దుమ్మురేపేలా పవన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు

Updated on: Sep 02, 2026 | 7:10 PM

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు, జనసైనికులు సాధారణ వేడుకలకు భిన్నంగా పలు సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ద్వారకాతిరుమలలో మొక్కలు నాటి పూజలు చేయగా, అమలాపురంలో మహిళలు పవన్‌ సినిమాల పేర్లతో రంగురంగుల ముగ్గులు వేశారు. అరకు చొంపిలో దింసా నృత్యాలు, ఎలమంచిలిలో బైక్‌ ర్యాలీతో అభిమానులు సందడి చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం, పచ్చదనం పెంపు వంటి చర్యలతో ఆయన రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సాధారణంగా ఫ్యాన్స్ డీజేలతో రచ్చ చేస్తుంటే, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో మాత్రం జనసైనికులు వినూత్నంగా వేడుకలు జరిపారు. గోపాలపురం నియోజకవర్గ నేత దిరిసిన ఫాతిమారాణి ఆధ్వర్యంలో ‘ప్రకృతికి ప్రణామం’ కార్యక్రమం చేపట్టారు. నక్షత్రవనంలో పవన్ జన్మనక్షత్రానికి సంబంధించిన పవిత్ర మొక్కను నాటి, ఆయన ఆయురారోగ్యాల కోసం చిన్న వెంకన్న సన్నిధిలో 55 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మహిళలు మరింత వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. రవణం వీధిలో ఇంటి ముందు వాకిళ్లలో రంగురంగుల ముగ్గులతో ‘హ్యాపీ బర్త్ డే డిప్యూటీ సీఎం’ అని రాశారు. ఆ ముగ్గుల చుట్టూ తొలిప్రేమ, బద్రి, జల్సా, పంజా, బాలు, ఓజీ వంటి పవన్ సినిమా పేర్లతో అందంగా తీర్చిదిద్దారు. తమకు ఈ రోజు పండుగ లాంటిందని పేర్కొంటూ, అమలాపురం పవన్ అభిమానుల అడ్డా అని నినాదాలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం చొంపిలోనూ పవన్‌కళ్యాణ్‌ బర్త్‌డే వేడుకలు అంబరాన్ని తాకాయి. దింసా నృత్యాలతో కోలాహలంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హస్తకళల సృజనాత్మకత చైర్మన్ వంపురి గంగులయ్య పాల్గొని, పవన్ కళ్యాణ్ పై రాసిన ప్రత్యేక గేయం ఆడియోను ఆవిష్కరించారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో పవన్‌ బర్త్‌డే సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అచ్యుతాపురం నుంచి ఎలమంచిలి వరకు సాగిన ఈ ర్యాలీలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు చేపట్టిన ఈ సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు పవన్ పుట్టినరోజును ప్రత్యేకంగా నిలిపాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్‌లైన్‌లోనే పెద్దల ఆశీస్సులు!

వెయ్యి రోజుల పాలన.. ఫ్రీగా ఉల్లిగడ్డల పంపిణీ! వరంగల్‌లో కాంగ్రెస్ నేత వినూత్న సంబరాలు!

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్‌? భారీగా తగ్గిన పసిడి ధర

బైక్‌పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!

నేపాల్‌ వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లు.. యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం

Loading...
Unable to load recommendations.
Follow Us