Big News Big Debate: మీటర్లు పంచాయితీ ఎన్నికల అజెండాగా మారిందా ?? పవర్ యుద్ధంలో ఎవరిది పైచేయి ??
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మోటార్లకు మీటర్ల చిచ్చు పతాక స్థాయికి చేరింది. మీటర్లు పెట్టనందుకే కేంద్రం 25 వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వలేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అదనపు రుణాలు కావాలంటే రూల్స్ పాటించాలని కేంద్రం చెబుతోంది. దీనిపై కేంద్ర, రాష్ట్రాల మధ్య పవర్ ఫైట్ రాజుకుంది. విమర్శల మీటర్ కూడా పెరిగింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మోటార్లకు మీటర్ల రగడ కొత్త మలుపు తీసుకుంది.

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీటర్ల వ్యవహారంపై ఇచ్చిన క్లారిటీ రచ్చ రాజేసింది.
కేంద్రం ఒక్కపైసా కూడా ఆపలేదన్న నిర్మలా … అదనపు రుణాలు ఇవ్వాలంటే నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే రియాక్ట్ అయ్యారు సీఎం కేసీఆర్. మోటార్లకు మీటర్లు పెట్టలేదని కేంద్రం 25వేల వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలని మరోసారి రుజువైందన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాజస్తాన్‌లో మీటర్లు పెట్టి అప్పు చేసిందని.. దీనిపై రాహుల్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు హరీష్‌రావు.
అటు కరెంట్ మీటర్ల యుద్ధం జరుగుతుండగానే.. ఇందిరాపార్కులో కర్నాటక రైతులు ఆందోళన రాజకీయం ప్రకంపనలు సృష్టిస్తోంది. రైతులకు 5గంటలు కూడా విద్యుత్ సరఫరా జరగడం లేదని.. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ను నమ్మొద్దంటున్నారు కర్నాటక రైతులు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో తిరిగి కాంగ్రెస్ మోసాలను బయటపెడతామంటున్నారు రైతులు. మొత్తానికి తెలంగాణలో పవర్ ఫుల్ యుద్ధం నడుస్తోంది. మోటార్లకు మీటర్ల అంశంపై రగడ ఎన్నికల ప్రచారాన్ని కుదిపేస్తోంది. మరి కేంద్రం మీటర్ల విషయంలో సెల్ఫ్‌గోల్ వేసుకుందా? బీఆర్‌ఎస్ కావాలనే ప్రచారం చేస్తోందా? కాంగ్రెస్‌ను కర్నాటక వైఫల్యాలు వెంటాడుతున్నాయా?
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ దున్న ఖరీదు రూ.11 కోట్లు !! అంత రేటు ఎందుకంటే ??
ఏమి ఇకమత్‌రా బాబోయ్.. చిన్న టెట్రా ప్యాక్ తెరిచి చూస్తే.. కళ్లు జిగేల్
ఇజ్రాయెల్ నౌకను ఇలా హైజాక్ చేశారు !! తాజాగా విడుదల చేసిన హూతీ రెబెల్స్
రన్‌వే నుంచి సముద్రంలోకి విమానం !! చూసి షాక్ తిన్న స్థానికులు