PM Modi: బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉంటేనే మంచిది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Updated on: May 10, 2026 | 8:08 PM

బెంగాల్‌ తరహాలోనే తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ పరేడ్‌ గ్రౌండ్స్‌ సభలో ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇక బీజేపీ అధికారంలోకి వస్తుందనీ, ప్రతి కార్యకర్తలో ఆ జోష్‌ కనిపిస్తోందని ప్రధాని మోదీ, కార్యకర్తల జయజయధ్వానాల మధ్య చెప్పారు.

బెంగాల్‌ తరహాలోనే తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ పరేడ్‌ గ్రౌండ్స్‌ సభలో ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇక బీజేపీ అధికారంలోకి వస్తుందనీ, ప్రతి కార్యకర్తలో ఆ జోష్‌ కనిపిస్తోందని ప్రధాని మోదీ, కార్యకర్తల జయజయధ్వానాల మధ్య చెప్పారు. బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాటు జనం బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉంటే మంచిదన్నారు. బంగారం కొనుగోళ్లతో విదేశీ మారక ద్వవ్య నిల్వలు బాగా తగ్గిపోతున్నాయన్నారు. అంతేకాకుండా.. పెట్రోల్, డీజిల్‌ వాడకం తగ్గించాలని సూచనలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ నగరమంతా కాషాయ తోరణాలు, బీజేపీ ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేసింది. ఈ క్రమంలోనే.. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ కార్యక్రమం తర్వాత.. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకోనున్న మోదీకి గెలిచిన సుమారు వంద మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో స్వాగతం పలకనున్నారు. పరేడ్‌ గ్రౌండ్‌ సభలో కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు మాట్లాడిన తర్వాత.. ప్రధాని మోదీ సుమారు 40నిమిషాలు ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఇక.. ప్రధాని మోదీ టూర్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 2వేల 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముగ్గురు DCPలు, ఐదుగురు అదనపు DCPలు, 21మంది ACPలు, 57 మంది ఇన్‌స్పెక్టర్లు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్స్‌, స్నిఫర్ డాగ్స్, ఆక్టోపస్‌, SOT బృందాలతో తనిఖీలు చేపట్టారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో సీసీటీవీ నిఘాను కట్టుదిట్టం చేశారు. అన్ని ప్రవేశ ద్వారాల దగ్గర స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు. బేగంపేట్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి పరిధిలో డ్రోన్లు, యూఏవీలు, కెమెరాలు, బ్యాగులు, బ్యానర్ల ప్రదర్శనపై నిషేధం విధించారు.

Published on: May 10, 2026 04:56 PM
Follow Us