Rottela Panduga: రొట్టెల పండుగలో ఆసక్తికర సంఘటన ఎమ్మెల్యే రొట్టెలు పంచుకున్న సోదరులు

Edited By:

Updated on: Jun 30, 2026 | 9:24 PM

ప్రపంచ ప్రసిద్ధి చెందిన నెల్లూరు రొట్టెల పండుగలో ఈసారి ‘ఎమ్మెల్యే రొట్టె’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు తమ సోదరుడు గిరిధర్ రెడ్డికి ఎమ్మెల్యే కావాలనే కోరికతో రొట్టె అందించారు. ఈ ఘటనతో వచ్చే ఎన్నికల్లో రాజకీయ వారసత్వంపై నెలకొన్న ఊహాగానాలకు మరింత ఊతం లభించింది.

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ప్రపంచ ప్రసిద్ధ నెల్లూరు రొట్టెల పండుగలో ఈసారి ఒక అత్యంత ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. కోరిన కోర్కెలు తీర్చే ఈ వేడుకలో.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు తమ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ‘ఎమ్మెల్యే రొట్టె’ను అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నెల్లూరు స్వర్ణాల చెరువు వేదికగా జరిగే ఈ ఐదు రోజుల రాష్ట్ర పండుగలో భక్తులు బారాషహీద్ దర్గాను దర్శించుకుని, తమ కోరికల రొట్టెలను మార్చుకోవడం ఆనవాయితీ. అయితే, వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తన రాజకీయ వారసుడిగా తమ్ముడు గిరిధర్ రెడ్డి పేరును గతంలోనే ఖరారు చేశారు. కాగా, ఇటీవల కోటంరెడ్డి కుమార్తె సాయి వైష్ణవి కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది ఎవరనే దానిపై సర్వత్రా ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ రాజకీయ సస్పెన్స్‌కు రొట్టెల పండుగ సాక్షిగా కోటంరెడ్డి దంపతులు తెరదించారు. స్వర్ణాల చెరువులో గిరిధర్ రెడ్డికి ‘ఎమ్మెల్యే కావాలనే’ రొట్టెను స్వయంగా అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి దంపతులు మాట్లాడుతూ.. గిరిధర్ రెడ్డిని తమ బిడ్డలతో సమానంగా చూస్తామని, వచ్చే ఎన్నికల్లో అతను ఎమ్మెల్యే కావాలనేదే తమ కుటుంబ కోరిక అని స్పష్టం చేశారు. ఈ అపూర్వ దృశ్యం ప్రస్తుతం నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే ఐటీ ఉద్యోగులను మించిన ఐడియా!

అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!

క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటో తెలిస్తే షాకవుతారు!

“దయచేసి వెళ్లొద్దు”.. యజమాని పంపిన ఒక్క మెసేజ్ నెటిజన్ల మనసు దోచేసింది!

ఆ రంగంలో మహిళలకే ఎక్కువ జీతాలు

Follow Us