ఏసి మెకానిక్ అంటూ వచ్చి ఇల్లు మొత్తం దోచేశాడు

Edited By:

Updated on: Mar 21, 2026 | 4:38 PM

ఎల్బీనగర్ రాక్ హిల్స్ కాలనీలో ఏసీ మెకానిక్‌గా నటించిన దుండగుడు ఇంట్లోకి చొరబడి మహిళను సుత్తితో కొట్టి మంగళసూత్రాన్ని దోచుకెళ్లాడు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు అబ్రార్ అహ్మద్‌ను పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ రాక్ హిల్స్ కాలనీలో జరిగిన దారుణమైన చోరీ కలకలం రేపింది. ఏసీ మెకానిక్‌గా నటిస్తూ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఒక మహిళపై దాడి చేసి మంగళసూత్రాన్ని అపహరించాడు. వివరాల్లోకి వెళితే, మాస్క్ ధరించి తన ముఖం కనిపించకుండా జాగ్రత్త పడిన నిందితుడు, ఏసీ రిపేర్ చేస్తానంటూ ఇంట్లోకి చొరబడ్డాడు. లోపలికి వెళ్లగానే మహిళ తలపై సుత్తితో గట్టిగా కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. వెంటనే ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కేదార్‌నాథ్ దర్శనానికి.. సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందేనా ??

Kim Jong Un: కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్‌ మామ షికారు.. నెక్స్ట్ టార్గెట్ ఏ దేశం

ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్‌

ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు

Beetroot: బీట్‌రూట్‌ జ్యూస్‌ వీళ్లు అస్సలు తాగకూడదు తెలుసా

Loading...
Unable to load recommendations.
Follow Us