Twitter Features: ట్విట్టర్‌లో సరికొత్త ఫీచర్.. బ్లాక్ చేయకుండానే..! ఎలానో పూర్తిగా ఈ వీడియోలో..
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేయకుండానే.. సదరు ఫాలోవర్‌ను తొలగించొచ్చు. అదెలాగంటే.. మీ టైమ్‌లైన్, ట్వీట్స్‌ను ఎవరైనా వ్యక్తులు, యూజర్లు చూడకూడదు...
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేయకుండానే.. సదరు ఫాలోవర్‌ను తొలగించొచ్చు. అదెలాగంటే.. మీ టైమ్‌లైన్, ట్వీట్స్‌ను ఎవరైనా వ్యక్తులు, యూజర్లు చూడకూడదు అనుకున్నట్లయితే ఈ ఫీచర్‌ను వినియోగించి వారికి మీ ట్వీట్స్ కనిపించకుండా చేయొచ్చు. ఇప్పటి వరకు తాము చేసే ట్వీట్లు, తమ ప్రొఫైల్ పిక్చర్ తమకు నచ్చని వ్యక్తులకు కనిపించకుండా ఉండాలంటే వారిని బ్లాక్ చేయాల్సి వచ్చేది. అయితే, కొందరు బ్లాక్ చేయడానికి ఇష్టపడరు. కానీ తమ ఫీడ్ మాత్రం వారికి కనిపించొద్దని భావిస్తుంటారు. అలాంటి వారికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ‘సాఫ్ట్ బ్లాకింగ్’ పేరుతో వస్తున్న ఈ ఫీచర్ తో ఫాలోవర్స్‌పై ట్విట్టర్ యూజర్ గ్రిప్ పొందవచ్చు. అంటే.. ఈ ఫీచర్ ద్వారా ట్రోలింగ్ నుంచి తప్పించుకోవడం, ప్రైవసీని కాపాడుకోవడం చేయొచ్చు.
ఇక ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. ముందుగా మీరు కంప్యూటర్, మొబైల్ యాప్‌లో ట్విట్టర్ అకౌంట్‌కి లాగిన్ అవ్వాలి. తర్వాత ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్ళి ఫాలోవర్స్ లిస్టును ఓపెన్ చేయాలి. వద్దు అనుకుంటున్న ఫాలోవర్‌ను ఎంపిక చేసుకుని, పేరు పక్కన ‘త్రీ డాట్ మెనూ’ను టాప్ చేయాలి. ఆప్షన్స్‌లో ‘రిమూవ్ ద ఫాలోవర్’ని ఎంపిక చేసుకోవాలి. ఒకసారి ఇలా చేస్తే సదరు ఫాలోవర్ సంబంధిత జాబితా నుంచి మాత్రమే తొలగుతాడు. అప్పటికీ తను ప్రొఫైల్, ట్వీట్స్‌ను చూడగలుగుతారు. అది కూడా వద్దనుకుంటే మాత్రం ఆ ఫాలోవర్‌ను బ్లాక్ చేయాల్సిందే.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

