Mobile Recharge: మెుబైల్ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌..! మరోసారి పెరగనున్న చార్జీలు..

|

Jun 01, 2022 | 8:53 AM

గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని టెలికాం కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎంచుకుంటున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ఆదాయాన్ని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు వినియోగదారులపై మరింత భారాన్ని మోపుతున్నాయి.


గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని టెలికాం కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎంచుకుంటున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ఆదాయాన్ని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు వినియోగదారులపై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే గత సంవత్సరం నవంబర్ లో ప్రీ పెయిడ్ ఛార్జీలను పెంచాయి. కానీ పెరుగుతున్న ఖర్చులను భర్తీ చేసుకునేందుకు ఈ సంవత్సరం మరోసారి వడ్డించేందుకు ఆపరేటర్లు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.టెలికాం ఆపరేటర్లు ఈ సంవత్సరం దీపావళి నాటికి ఛార్జీలను 10 నుంచి 12 శాతం మేర పెంచేందుకు సిద్ధమౌతున్నాయి. వినియోగదారుని నుంచి వచ్చే యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ ఎయిర్ టెల్ కు 200, జియో 85, వొడాఫోన్ ఐడియా 135 రూపాయలుకు పెంచుకోవాలని కంపెనీలు చూస్తున్నాయని ఈక్విటీ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. గత సంవత్సరం టెలికాం దిగ్గజాలు సగటున 20 నుంచి 25 శాతం వరకు రేట్లను పెంచాయి. దీంతో ఎక్కువ మంది వినియోగించుకునే బేసిక్ ప్లాన్ రేటు 79 నుంచి 99 రూపాయలు చేరింది. ఎయిర్ టెల్ 84 రోజుల వ్యవధితో అందిస్తున్న 698 రూపాయల ప్యాక్ రేటు 839 రూపాయలకి చేరింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Follow us on