Custard Apple Benefits: సీతాఫలాలతో ఎన్ని లాభాలో అదిరిపోయే బెనిఫిట్స్‌.. తెలిస్తే.. వదిలిపెట్టరు..! (వీడియో)

Updated on: Nov 10, 2021 | 7:35 AM

ప్రస్తుత కాలంలో చాలా మందిలో ఇమ్యూనిటి లెవల్స్‌ తగ్గిపోతున్నాయి. అలాగే రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కారణం.. తినే ఆహారం, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన, పీల్చే గాలి తదితర కారణాల వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ప్రతి రోజు పండ్లను తినడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి.


ప్రస్తుత కాలంలో చాలా మందిలో ఇమ్యూనిటి లెవల్స్‌ తగ్గిపోతున్నాయి. అలాగే రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కారణం.. తినే ఆహారం, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన, పీల్చే గాలి తదితర కారణాల వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ప్రతి రోజు పండ్లను తినడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి. వీటి వల్ల వివిధ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. కొన్ని పండ్లు ఏడాది పొడవునా లభిస్తుంటే.. మరి కొన్ని పండ్లు సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. అలాంటి పండ్లను మాత్రం వదిలిపెట్టకుండా తింటే ఎన్నో ఉపయోగాలున్నాయి. ఈ వర్షాకాలంలో వినాయక చవితి నుండి విరివిగా లభించే ఈ సీతాఫలంలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అందుకే దీనిని పోషకాల ఘని అంటారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి. సీతాఫలం అల్సర్లను నయం చేయడంలోనూ, అసిడిటీని నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

అంతేకాదు ఇది కంటి చూపును, జుట్టుని, మెదడు పనితీరు మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుంది. సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారిస్తుంది. సీతాఫలం క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. సీతాఫలం (Low-glycemic index)లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు. ఇంకా సీతాఫలం బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఔషధంగా చెప్పొచ్చు. కాకపొతే, ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది కనుక మోతాదుకి మించి సీతాఫలాలు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. అధిక రక్తపోటును తగ్గించడంలోనూ సీతాఫలం నెం.1 గా చెప్పుకోవచ్చు.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Published on: Nov 10, 2021 07:34 AM
Loading...
Unable to load recommendations.
Follow Us