SBI BUMPER OFFER: డెబిట్‌ కార్డ్‌ ఉందా.. అయితే మీకో బంపరాఫర్‌..! పూర్తి వివరాలు ఈ వీడియోలో..

|

Nov 26, 2021 | 8:59 AM

ఎస్బీఐ కస్టమర్లకు నిజంగా ఇది గుడ్‌ న్యూస్‌. ఎస్బీఐ డెబిట్‌ కార్డ్‌ ఉన్నవారికి ఓ మంచి అవకాశాన్ని ఇచ్చింది స్టేట్‌బ్యాంక్‌. ముఖ్యంగా షాపింగ్‌ అంటే ఎక్కువ ఇష్టపడేవారికి ఇది సూపర్‌ ఆఫర్‌ అని చెప్పొచ్చు. స్టేట్‌ బ్యాంకులో అకౌంట్‌ ఉండి, డెబిట్‌ కార్డు ఉపయోగిస్తున్న వారికి లోన్‌ అందించనుంది.


ఎస్బీఐ కస్టమర్లకు నిజంగా ఇది గుడ్‌ న్యూస్‌. ఎస్బీఐ డెబిట్‌ కార్డ్‌ ఉన్నవారికి ఓ మంచి అవకాశాన్ని ఇచ్చింది స్టేట్‌బ్యాంక్‌. ముఖ్యంగా షాపింగ్‌ అంటే ఎక్కువ ఇష్టపడేవారికి ఇది సూపర్‌ ఆఫర్‌ అని చెప్పొచ్చు. స్టేట్‌ బ్యాంకులో అకౌంట్‌ ఉండి, డెబిట్‌ కార్డు ఉపయోగిస్తున్న వారికి లోన్‌ అందించనుంది. ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుతో ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తే ఆ మొత్తాన్ని సులభమైన వాయిదాల్లోకి మార్చుకునే అవకాశాన్ని కల్పించింది.

మీరు ఈ అవకాశాన్ని లక్ష రూపాయల వకరూ ఉపయోగించుకోవచ్చు. మీరు ఒక లక్ష రూపాయల షాపింగ్‌ చేశారనుకోండి దానిని ఈఎమ్‌ఐలోకి మార్చుకోవచ్చు. ఇక ఫెస్టివ్‌ ఆఫర్‌ కింద ప్రాసెసింగ్‌ ఫీజు కూడా మినహాయింపు ఇచ్చింది ఎస్‌బీఐ. మరి మీరు లోన్‌కు అర్హులో కాదో తెలసుకోడానికి ఎస్‌బీఐ ఖాతాకు రిజిస్టర్ అయి ఉన్న మీ మొబైల్‌ నెంబర్‌ నుంచి 567676 నెంబర్‌కు DCEMI అనే మెసేజ్‌ను చేస్తే సరిపోతుంది. పూర్తి వివరాలు మీ ముందుంటాయి.

Published on: Nov 26, 2021 08:59 AM