ఆలయంలో శ్రావణమాస పూజలు.. ఒక్కసారిగా అలజడి.. కనిపించిన దృశ్యం చూసి షాక్!
అది శ్రీరాముని ఆలయం.. భక్తులంతా శ్రావణమాస పూజల్లో నిమగ్నమయ్యారు. పూజారి కూడా సీతారాములకు పూజలు చేస్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా అలజడి. అందరూ ఉరుకులు.. పరుగులు తీశారు. హడావుడి మొదలైంది. కట్ చేస్తే..
అది శ్రీరాముని ఆలయం.. భక్తులంతా శ్రావణమాస పూజల్లో నిమగ్నమయ్యారు. పూజారి కూడా సీతారాములకు పూజలు చేస్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా అలజడి. అందరూ ఉరుకులు.. పరుగులు తీశారు. హడావుడి మొదలైంది. కట్ చేస్తే.. అసలు విషయం తెలిసి, పూజారి సైతం పరుగు అందుకున్నారు. తీరా చూస్తే, నాగు పాము కలకలం రేపింది. భుసలు కొడుతూ హడలెత్తించింది. విశాఖ మల్కాపురం శ్రీరాముని ఆలయంలో భక్తుల హడావుడితో పడగ విప్పి హల్చల్ చేసింది ఆరడుగుల నాగు పాము. దీంతో భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు.. చాకచక్యంగా పామును బంధించి, నగర శివారు లో విడిచి పెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..