శరీరాలను ఆవిరి చేసే బాంబుతో.. గాజాపై ఇజ్రాయెల్ దాడి!
గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ దారుణమైన ‘వాక్యూమ్ బాంబులను’ ఉపయోగిస్తోందని అల్ జజీరా నివేదిక తెలిపింది. ఈ బాంబులు మొదట గాలిలో భారీ అగ్ని గోళాన్ని సృష్టిస్తాయి. చుట్టుపక్కల గాలిని లాగటం ద్వారా ఒక రకమైన వాక్యూమ్‌ను సృష్టిస్తాయి.అనంతరం ఏర్పడే పేలుళ్ల నుంచి ఉష్ణోగ్రత 3,500 డిగ్రీలకు చేరుకుంటుంది. ఈ బాంబుల్లో అల్యూమినియం, మెగ్నీషియం వంటి మూలకాలు.. కొన్ని సెకన్లలో మానవ శరీరాల్ని కాల్చేస్తాయి. అందువల్లే ఇజ్రాయెల్ దాడుల్లో చాలా మృతదేహాలు కనపడటం లేదని, 3,500 మందికిపైగా పౌరుల ఆచూకీ గల్లతైందని అంటున్నారు.
గాజా సివిల్ డిఫెన్స్ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 2,800 మంది పాలస్తీనీయులు ఈ బాంబు దాడుల వల్ల ఆవిరైపోయారనీ వీటిని అమెరికా సరఫరా చేసిన బాంబులుగా గుర్తించారు. సామాన్య పౌరులపై ఇలాంటి ఆయుధాలను వాడటం మానవతా చట్టాల ఉల్లంఘనే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2023 అక్టోబర్ నుంచి దాదాపు ఏడాది పాటు గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. దాంతో 72 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2025లో ఇజ్రాయెల్ పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. వైద్యచికిత్సల కోసం ఈజిప్ట్‌కు వెళ్లి వచ్చేందుకు గాజా ప్రజలకు అనుమతి ఇచ్చింది ఇజ్రాయెల్. ఒప్పందంలో భాగంగా ఇటీవల రఫా బార్డర్‌ను తెరిచింది.
మరిన్ని వీడియోల కోసం :